MG Windsor EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. జస్ట్ రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో MG విండ్సర్ EV ఇంటికి తెచ్చుకోవచ్చు!

Updated on: August 16, 2025

MG Windsor EV : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే. ఎలక్ట్రిక్ కారు JSW MG కొత్త విండ్సర్ EV కారు (MG Windsor EV) ఇప్పుడే కొనేసుకోండి. మీరు ఈ కారును కొనుగోలు చేస్తే.. డౌన్ పేమెంట్ తర్వాత మీరు ఎంత EMI చెల్లించాలి? కారు కొనేందుకు మీకు ఎంత మొత్తంలో ఖర్చవుతుంది అనే వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

MG విండ్సర్ EV ధర ఎంతంటే? :
ఎంజీ మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త ఎలక్ట్రిక్ SUV విండ్సర్ EV బేస్ వేరియంట్ రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. మీరు ఢిల్లీలో కొనుగోలు చేస్తే.. ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 14.94 లక్షలు.

ఈ మొత్తం ధరలో రూ. 13.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర, దాదాపు రూ. 6,300 ఆర్టీఓ రుసుము, దాదాపు రూ. 73వేలు ఇన్సూరెన్స్ ఉన్నాయి. అంతేకాదు.. రూ. 14,700 TCS ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ కలిపితే కారు మొత్తం ఆన్-రోడ్ ధర రూ. 14.94 లక్షలు అవుతుంది.

Advertisement

MG Windsor EV : 2 లక్షల డౌన్ పేమెంట్, ఈఎంఐ ఎంతంటే? :

మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే.. బ్యాంక్ ఎక్స్-షోరూమ్ ధరకు ఫైనాన్స్ చేస్తుంది. అలాంటప్పుడు, మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకు నుంచి దాదాపు రూ. 12.94 లక్షల ఫైనాన్స్ పొందాలి. బ్యాంక్ మీకు 7 ఏళ్లకు 9శాతం వడ్డీతో రూ. 12.94 లక్షలు ఇస్తే.. రాబోయే 7 ఏళ్లకు ప్రతి నెలా కేవలం రూ. 20,820 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Read Also : POCO M7 Plus : పోకో కొత్త బడ్జెట్ ఫోన్‌ చూశారా? 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర కూడా చాలా తక్కువే

MG Windsor EV : కారు ఖరీదు ఎంతంటే? :

7 ఏళ్ల పాటు 9శాతం వడ్డీ రేటుతో రూ.12.94 లక్షల కారు రుణం తీసుకుంటే.. ప్రతి నెలా దాదాపు రూ.20,820 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కాలంలో, మొత్తం 7 ఏళ్లలో దాదాపు రూ.4.55 లక్షల వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ఛార్జీలు, వడ్డీతో సహా, ఎంజీ విండ్సర్ ఈవీ దాదాపు రూ.19.49 లక్షలు ఖర్చవుతుంది.

Advertisement

ఏయే కార్లతో పోటీ అంటే? :
విండ్సర్ EV కారు JSW MG ఎలక్ట్రిక్ కారుగా వచ్చింది. టాటా కర్వ్ EV, మహీంద్రా BE6 వంటి ఎలక్ట్రిక్ SUV కార్లతోతో నేరుగా పోటీపడుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel