Anchor rashmi: కొన్ని వారాల క్రితం వరకు ఎక్స్ ట్రా జబర్దస్త్ షోక్ మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో రష్మీ గౌతమ్ కు జబర్దస్త్ యాంకర్ గా పని చేసే అవకాశం దక్కింది. తాజాగా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. గురువారం రోజు ఈ ఎపిసోడ్ ప్రసారం కాగా ఇంద్రజ, ప్రగతి ఈ షోకు జడ్జీలుగా వ్యవహరించారు. ప్రోమోలో చంటి ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయకుండా నేను చేస్కుంటే లోకం నికృష్టుడా దరిద్రుడా అని తిడుతుందని అన్నారు. ఇవన్నీ చేయకపోయినా అదే విధంగా అనుకుంటున్నరని లేడీ గెటప్ వేస్కున్న కమెడియన్ కామెంట్ చేశారు. సునామీ సుధాకర్ రష్మీని చూస్తూ.. విస్కీయా అంటే పక్కనే ఉన్న వ్యక్తి కాదురా అని చెబుతాడు. ఈ తర్వాత సుధాకర్ రమ్మా చూడగానే మత్తెక్కిస్తుందిరా అని వెల్లడిస్తారు. పక్కన ఉన్న కమెడియన్ దగ్గర నుంచి చూడరా దిగిపోతుందని చెబుతాడు.
ఆ తర్వాత రష్మీ వేలు చూపిస్తూ మీకు దింపుతాను ఇప్పుడు అంటూ కామెంట్ చేస్తుంది. ఆ తర్వాత దొరబాబు సూర్యవంశం సినిమాలోని పెద్ద వెంకటేష్ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ప్రగతి గారికి నేను మార్కు ఇద్దామనుకుంటున్నాను అని చెప్తూ.. త ఫోన్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇంద్రజ వెంటనే మీ ఫోన్ నంబర్ మాకు వద్దండి బాబు అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం.