Whats app : ఎలాంటి రియాక్షన్ అయినా ఎమోజీతోనే.. వాట్సాప్ కొత్త అప్ డేట్!

You can use any emoji for reactions in whats app...
You can use any emoji for reactions in whats app...

Whats app : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం మరో సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇటీవల వరుసగా ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్ దాన్ని కొనసాగించింది. అయితే ఈసారి ఓ ఫీచర్ కు అప్ డేట్ ను తీసుకొచ్చింది. రెండు నెలల క్రితం ప్రవేశ పెట్టిన మెసేజ్ రియాక్షన్ ఫీచర్ కు అదనపు సదుపాయాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే గ్లోబల్ గా ఈ ఫీచర్ అప్ డేట్ రోల్ అవుట్ ను వాట్సాప్ మొదలు పెట్టింది. రానున్న కొన్ని రోజుల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది. ఈ విషయాన్ని వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

 

Advertisement
You can use any emoji for reactions in whats app...
You can use any emoji for reactions in whats app…

Whats app : వాట్సాప్ కొత్త అప్ డేట్….

ప్రస్తుతం వాట్సాప్ మెసేజ్ రియాక్షన్ లో ఆరు ఎమోజీలు మాత్రమే ఉన్నాయి. లైక్, లవ్, లాఫ్, సర్ ప్రైజ్, సాడ్, థాంక్స్ ఎమోజీలు కనిపిస్తున్నాయి. ఏ మెసేజ్ కైనా ఈ ఎమోజీలతో రియాక్షన్ ఇవ్వొచ్చు. మెసేజ్ ఫొటో, వీడియో ఏదైనా దానిపై అయినా ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే ఎమోజీలు కనిపిస్తున్నాయి. వాటిలో ఎంపిక చేసుకొని ఎమోజీ ద్వారా రియాక్షన్ ఇవ్వొచ్చు. టెలిగ్రామ్, ఇమేజెస్, స్లాక్, ఇన్ స్టా గ్రామ్ లలో చాలా రోజుల నుంచి ఈ ఫీచర్ ఉండగా… చాలా రోజుల టెస్టింగ్ ద్వారా వాట్సాప్ రెండు నెలల క్రితం దీన్ని ప్రవేశ పెట్టింది.

Read Also : Whats app payments: వాట్సాప్ లోనూ క్యాష్ బ్యాక్.. ఇక పండగే!

Advertisement