Billa ganneru : దాదాపు ప్రతీ ఒక్కరి ఇంటి ముందు అలంకరణ కోసం వాడే అనేక రకాల పూల మొక్కల్లో బిళ్ల గన్నేరు ఒకి. ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. కేవలం అలకంరణ కోసమే కాకుండా ఈ మొక్క దివ్య ఔషధంగా కూడా పని చేస్తుంది. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. బిళ్ల గన్నేరు మొక్కను ఉపయోగించి ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Billa ganneru : బిళ్ల గన్నేరు మొక్కల్లో ఆయుర్వేద ఔషధం….
మనకు గాయాలు అయినప్పుడు ఈ మొక్క ఆకులను ముద్దగా నూరి గాయంపై ఉంచడం వల్ల రక్త స్రావం తగ్గుతుంది. అంతే కాదండోయ్ గాయాలు కూడా త్వరగా నయం అవుతాయి. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ముక్కు నుండి రక్తం కారడం మనకు తెల్సిన విషయమే. అలాంటప్పుడు బిళ్ల గన్నేరు పువ్వులను, దానిమ్మ చెట్టు మొగ్గలను కలిపి నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని ముక్కు రంధ్రాలలో రెండు చుక్కుల చొప్పు వేస్తే.. వేడి వల్ల ముక్కు నుంచి రక్తం కారడం తగ్గుతుంది. అలాగే షుగర్ వ్యాధిని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రెండు బిళ్ల గన్నేరు ఆకులను పరగడుపును తినడం వల్ల షుగర్ ను పూర్తిగా తగ్గించుకోవచ్చు.
Read Also : Wheat Grass Juice : ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలు.. ఎలాంటి రోగమైన ఇట్టే పారిపోవాల్సిందే..!