Whatsapp New Feature : మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వచ్చింది. అసలు ఈ ఫీచర్ వచ్చిందని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ ఎప్పుడు అప్ డేట్ అయిందో కూడా తెలియనంతగా ఉండిపోయింది. ఇప్పటికే రెగ్యులర్ యూజర్లకు కూడా వాట్సాప్ కొత్త ఫీచర్ యాడ్ అయింది.
వాట్సాప్‌లో వచ్చిన మార్పులను గమనించిన కొందరు బాబోయ్ ఇదేంటి యాప్ ఇలా మారిపోయిందని అనేస్తున్నారు. ఇప్పటివరకూ వాట్సాప్ (Whatsapp) ఓపెన్ చేస్తే చాలు.. చాట్స్, స్టేటస్, కాల్స్ మూడు ఆప్షన్లు ఉండేవి. ఇప్పుడు వాట్సాప్‌లో అలా కనిపించడం లేదు. అందులో మరో కొత్త ఆప్షన్ వచ్చి చేరింది.
కెమెరా ఐకాన్ గమనించారా? అయితే మీ వాట్సాప్ ఓసారి ఓపెన్ చేసి అక్కడ కెమెరా ఐకాన్ ఉందో లేదో ఓసారి చెక్ చేయండి. కెమెరా ఐకాన్ పై ట్యాప్ చేస్తే చాలు.. వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే.. మీరు వాట్సాప్ చాట్ ఓపెన్ చేసిన సమయంలో అక్కడి నుంచే మీకు నచ్చిన ఫొటోలు లేదా వీడియోను రికార్డు చేసి పంపుకోవచ్చు.
Whatsapp New Feature : వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. కెమెరా ఐకాన్ అంట..
లేదంటే స్టేటస కూడా పెట్టుకోవచ్చు. అయినా ఈ ఫీచర్ వాట్సాప్ లో ఎప్పటినుంచో ఉంది కదా? ఇందులో కొత్తమేం ఉంది అంటారా? అని మీ సందేహమా? మొన్నటివరకూ మీరు ఏదైనా యూజర్ చాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కెమెరా ఐకాన్ కనిపించేది.
ఇప్పుడు వాట్సాప్ యూజర్ చాట్ లోకి వెళ్లకుండానే హోంలోనే కెమెరా ఐకాన్ కనిపిస్తోంది. ఇక్కడి నుంచే మీరు తీసిన ఫొటో లేదా వీడియోను మీకు నచ్చినవారికి పంపుకోవచ్చు లేదా మీ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవచ్చు అనమాట.. వాట్సాప్ ఎప్పుడో ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం ఇప్పుడు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సాప్. భలేగా ఉంది కదా ఈ కెమెరా ఐకాన్ ఫీచర్.. అయితే మీరు కూడా వెంటనే ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో చెక్ చేయండి..
Read Also : WhatsApp: మీరు వాట్సాప్ వాడుతున్నారా.. అయితే ఈ 10 ఫీచర్స్ తెలుసుకోవాల్సిందే..?