September 21, 2024

Elon Musk: ఎలన్ మస్క్​‌కు పోటీగా ఎయిర్‌టెల్​ ఏం చేసిందంటే..?

1 min read
what-did-airtel-do-to-compete-with-elon-musk

what-did-airtel-do-to-compete-with-elon-musk

Elon Musk : భూమి మీద ఎక్కడ ఉన్నా కానీ వేగవంతమైన ఇంట‌ర్నెట్ వ‌చ్చేలా చూసేందుకు అపార కుబేరుడు ఎల‌న్ మ‌స్క్ స్టార్ లింక్స్ ఉప‌గ్ర‌హాల‌ను ఇప్పటికే అంతరిక్ష్యంలోకి ప్ర‌యోగించారు. ఆయన స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఈ ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌యోగిస్తున్న సంగ‌తి ఇప్పటికే మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఎల‌న్ మ‌స్క్‌కు పోటీగా ఎయిర్‌టెల్ వ‌న్‌వెబ్ అనే పేరుతో ఫ్రెంచ్ గ‌యానాలో ఉండే కౌర్ స్పేస్ అనే సెంట‌ర్ నుంచి దేశీయ టెలికాం దిగ్గజం భార‌తీ ఎయిర్‌టెల్ 34 ఉప‌గ్రహాల‌ను అంతరిక్ష్యంలోకి ప్ర‌యోగించింది.

భూమి మీద ఎక్కడ ఉన్న కానీ ఇంట‌ర్నెట్ యాక్సిస్ చేకునేందుకు ఈ ఉప‌గ్ర‌హాల‌ను అంతరిక్ష్యంలోకి పంపింది. ఈ సంవత్సరంలో ఎయిర్ టెల్ ప్ర‌యోగించిన ఈ ప్రయోగం మొద‌టి అనే చెప్పాలి. అయితే ఇప్పటికే నిపుణులు బృందం 34 ఉప‌గ్ర‌హాలను సబంధిత కక్ష్యలోకి విజ‌య‌వంతంగా ప్ర‌వేశ‌పెట్టారు.

what-did-airtel-do-to-compete-with-elon-musk
what-did-airtel-do-to-compete-with-elon-musk

ఇదిలా ఉంటే ఇలాంటి ప్రయోగాలను భారతీ ఎయిర్టెల్ ఇప్ప‌టి వ‌ర‌కు 13 సార్లు ప్రయోగించింది. ఈ ప్రయోగాల అన్నీంటిలో మొత్తం 428 ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశ‌పెట్టినట్లు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగం అమాంతంగా పెంచేందుకు ఈ ఉప‌గ్ర‌హాలను సంస్థ ఉపయోగించుకుంటుంది. అంతేగాకుండా త్వరలో మరిన్ని ప్రయోజనాలను వన్ వెబ్ చేపట్టనుంది. దీంతో మస్కుకు కూడా భారతీ ఎయిర్టెల్ పోటీగా రానుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.

ఇటీవల కాలంలో మస్క్ కాలిఫోర్నియా నుంచి స్పేస్​ఎక్స్​ రాకెట్ ను ప్రయోగించారు. దీనిలో సుమారు 52 స్టార్​లింక్​ ఇంటర్నెట్​ ఉపగ్రహాలను అంతరిక్ష్యంలోకి పంపారు. వీటిని ఫాల్కన్ అనే వాహక నౌక అంతరిక్ష్యంలోకి తీసుకుని పోయింది. ఈ ప్రాజెక్ట్ ను భారత్ లో ప్రవేశ పెట్టాలని మస్క్ భావిస్తున్నారు. కాని అనుమతులుకు ఇంకా సమయంలో పట్టేలా ఉందని ఇప్పటికే సంస్థ ప్రతినిధులు కొన్ని సంకేతాలు ఇచ్చారు.

Read Also : వీర్య కణాల కదలికలో జీడిపప్పుదే ప్రధాన పాత్ర..!