Smart Water Bottles: టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతూ వినియోగదారులకు స్మార్ట్ టెక్నాలజీని పరిచయం చేయడంలో యాపిల్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆపిల్ నుంచి ఇప్పటికే ఎన్నో ఫింగర్ ప్రింట్, స్మార్ట్‌వాచ్, నాచ్ డిస్‌ప్లే .ఇలా ఇప్పటికే ఎన్నో విడుదలయ్యాయి ఈ క్రమంలోనే తాజాగా యాపిల్ కంపెనీ మరొక ప్రాజెక్టును మార్కెట్లోకి తీసుకురానుంది.
ఈ క్రమంలోనే ఆపిల్ కంపెనీ స్మార్ట్ వాటర్ బాటిల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా అయినా కొనుగోలు చేయవచ్చు. యాపిల్ రూపొందించిన ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అనే విషయానికి వస్తే…ఈ స్మార్ట్ వాటర్ బాటిళ్లు యాపిల్ స్మార్ట్ వాచ్‌తో సింక్రనైజ్ అవుతూ మనం రోజుకు ఎంత నీటిని తీసుకుంటున్నాము మనం ఎలాంటి శారీరకశ్రమ చేస్తున్నాము అనే విషయాలను బేరీజు వేస్తోంది.
ఇక ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ ను హిడ్రేట్‌స్పార్క్ సంస్థ తయారు చేసింది. హిడ్రేట్ స్పార్క్ ప్రో, హిడ్రేట్ ప్పార్క్ ప్రో స్టీల్ రెండు వెర్షన్లలో లభిస్తోంది. హిడ్రేట్ స్పార్క్ ప్రో, వాటర్ బాటిల్ ధర రూ.4 500కాగా,హిడ్రేట్ ప్పార్క్ ప్రో స్టీల్ ధర 6000 రూపాయలు. ప్రస్తుతం ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో యాపిల్ సమస్త ఇంకా ఇలాంటి ఎన్ని స్మార్ట్ వస్తువులను అందుబాటులోకి తీసుకు వస్తుందో తెలియాల్సి ఉంది.