...
Telugu NewsHealth NewsChamomile Oil Benefits: మోకాళ్ళ నొప్పుల నివారణలో దివ్యౌషధంగా పనిచేసే నూనె .. ఇది వాడితే చాలు...

Chamomile Oil Benefits: మోకాళ్ళ నొప్పుల నివారణలో దివ్యౌషధంగా పనిచేసే నూనె .. ఇది వాడితే చాలు నొప్పులు మాయం!

Chamomile Oil Benefits : కాలం మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈరోజుల్లో అందరిని ఎక్కువగా వేధిస్తున్న సమస్య లో మోకాళ్ళ నొప్పులు కూడా ఒకటి. పూర్వకాలంలో వయసు పెరిగేకొద్ది ఇటువంటి సమస్యలతో బాధపడేవారు. కానీ ఈ రోజుల్లో చిన్న వయసు వారినే ఈ సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గించడానికి చాలా మంది మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అలా పెయిన్ కిల్లర్ ఉపయోగించడం మాత్రమే కాకుండా ప్రకృతిలో సహజసిద్ధంగా పెరిగే చిట్టిచామంతి మొక్కలతో ఈ నొప్పులు అన్నిటికీ చెక్ పెట్టవచ్చు.

Advertisement

Advertisement

చిట్టిచామంతి మొక్కలతో తయారుచేసిన నూనె ఈ నొప్పుల అన్నింటిని నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. చిట్టిచామంతి ఆకులతో తయారు చేసిన టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చిట్టి చామంతి ఆకులను ఆయుర్వేదం లో కూడా విరివిగా ఉపయోగిస్తారు. చిట్టి చామంతి ఆకులతో తయారు చేసిన నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది. కాకపోతే ఈ నూనె ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది.

Advertisement

కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు నొప్పి ఉన్న ప్రదేశంలో ఈ చిట్టిచామంతి నూనెను రాయడం వల్ల అది శరీరం లోపలికి చొచ్చుకుని పోయి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా నొప్పిని తగ్గిస్తుంది. ఫలితంగా అతి తక్కువ సమయంలో ఈ నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ చిట్టి చామంతి నూనెను ఆరోమా థెరఫీ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనె నొప్పులను నివారించడమే కాకుండా అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. పని ఒత్తిడి కారణంగా ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు గురైన వారు ఈ నూనె వాసన పీల్చడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు