True caller: ట్రూ కాలర్ ఐడీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. స్పామ్, స్కాం, నుంచి ఐఓఎస్ యాప్ యూజర్లకు మెరుగైన రక్షణార్థం ట్రూకాలర్ యాప్ ను పునరుద్ధరించిట్లు తెలిపింది. యాప్ ను సంపూర్ణంగా అప్ డేట్ చేసి గ్రూప్ అప్ నుంచి లైటర్ గా మరింత సమర్థవంతంగా రూపొందించామని పేర్కొంది. గత వెర్షన్ తో పోలిస్తే.. కొత్త యాప్ లో 10 రెట్లు మెరుగైన స్పామ్, స్కామ్, బిజినెల్ కాల్ ఐడెంటిఫికేషన్ ఉంటుందని తెలిపింది.
అలాగే యాపిల్ ప్లాట్ ఫాం యాప్ ల పైనే ఈ మార్పులు తీసుకొచ్చామని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు సీఈఓ అలెన్ మమెడీ ఈ సందర్భంగా చెప్పారు. కాల్ అలెర్ట్స్, కాల్ రీజన్, సెర్చ్ ఎక్స్ టెన్షన్ వంటి శక్తివంతమైన ఫీచర్లు అందించామని ప్రకటనలో పేర్కొన్నారు. ఐఫోన్ యూజర్ల కోసం చాలా కాలం తర్వాత ట్రూకాలర్ యాప్ ఈ అప్ డేట్ తీసుకొచ్చిందని పెర్కొన్నారు.
మెరుగైన ప్రొటెక్షన్ తో పాటు కాల్ కు రెస్పాండ్ అవ్వాలా వద్దా అని తెలియజేసే వేర్వేరు శబ్దం ఉంటందని వివరించారు. డిజైన్ ను కూడా పూర్తిగా మార్చేశామని, కొత్త యూజర్ అనుభూతి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. రోజువారీ నేవిగేషన్ ను త్వరగా పొందొచ్చని పేర్కొంది. త్వరలోనే ఎస్ఎంఎస్ ఫిల్డరింగ్, స్పామ్ డిటెక్షన్, కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్ ఉంటాయని వివరించింది.