Whats app: వాట్సాప్.. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు దీన్ని ఓపెన్ చేయనిది చాలా మంది ఉండలేరు. మనం ఏ పనీ చేయాలన్నా, ఎలాంటి విషయం తెలుసుకోవాలన్న కచ్చితంగా వాట్సాప్ వాడాల్సిందే మరి. ప్రస్తుతం కాలంలో వాట్సాప్ వాడని వాళ్లు ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మధ్య నకిలీ వాట్సాప్ యాప్ ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోందని.. యూజర్లు అంతా జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ సీఈఓ విల్ కాథ్ కార్చ్ హెచ్చరించారు. అంతే కాదండోయ్ వాట్సాప్ పేరుతో వస్తున్న హే వాట్సాప్ యాప్ ను వాడితే అనేక రకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని సూచించారు.
వాట్సాప్ లో లేని కొన్ని అదనపు ఫీచర్లు హే వాట్సాప్ యాప్ లో ఉన్నాయని, దానికి ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ ఉండదని తెలిపారు. హే వాట్సాప్ వాడితే వ్యక్తిగత సమాచారం అపహరణకు గురవుతుందని.. ఆయన వాట్సాప్ యూజర్లకు వార్నింగ్ ఇచ్చారు. మీరు కూడా జాగ్రత్తగా ఉండంది. అధిక ఫీచర్లు ఉన్నాయనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లోనూ హే వాట్సాప్ ను డౌన్ లోడ్ చేస్కోకండి. మోసపోకండి. మీరు చేసే, మీకు వచ్చే మెసేజ్ లను వేరే ఎవరూ చూడకుండా ఉండేలా జాగ్రత్త పడాలంటే కూడా కేవలం వాట్సాప్ ను మాత్రమే వాడాలి.