...

Jio New Offer : జియో సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.. కేవలం 899 రూపాయలకే ఇన్ని రోజుల వాలిడిటీనా.?

Jio New Offer : రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 899 రూపాయల లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో 336 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ డేటా తో సహా మరిన్ని ప్రయోజాలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ప్లాన్ కేవలం జియోఫోన్ వాడుతున్న యూజర్ల కోసం మాత్రమే వర్తిస్తుంది. మీరు కనుక జియోఫోన్ యూజర్ అయితే, మీకు నెల నెల రీఛార్జ్ చేసే పనిలేకుండా ఈ ప్లాన్ తో 336 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజానాలను అందుకోవచ్చు. ఈ ప్లాన్ ను JIO-ALL-IN-ONE కేటగిరిలో అందించింది.

జియో రూ.899 ప్లాన్ ప్రయోజనాలు ఇవే : ఈ ప్లాన్ 336 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఇది పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇది ఒక నెల సమయాన్ని 28 రోజులకు కుదిస్తుంది, జియో రెగ్యులర్ ఒక నెల రీఛార్జ్ మాదిరిగా ఉంటుంది. అలాగే ఈ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్లాన్ తో 28 రోజుల కు 2GB డేటా చొప్పున 12 నెలలకు 24 GB హై స్పీడ్ డేటా అందిస్తుంది.

అలాగే, నెలకు 50 SMS చొప్పున 12 నెలలకు ఉచిత SMS సౌకర్యాన్ని అందిస్తుంది. డైలీ 2.5GB హై స్పీడ్ డేటా మరియు మరిన్ని లాభాలు. Reliance Jio: మరొక జబర్దస్త్ ఆఫర్ ప్రకటించిన జియో. 29 రోజుల అధిక వ్యాలిడిటి. ఎయిర్టెల్ vs జియో vs Vi: టెలికం సంస్థలు అఫర్ చేసే బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్. ఇక జియో కస్టమర్లకు అధిక లాభాలను అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి చూస్తే Jio Rs.2,999 Plan ను పరిశీలించవచ్చు.

Jio Rs.2,999 Plan :
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 912.5GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది. అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.

Read Also : Laxmi Devi : మీ ఇంట్లో లక్ష్మిదేవి కొలువుండాలంటే..ఈ మూడు అలవాట్లను మానుకోండి..!