Google Drive : మారుతున్న కాలానుగుణంగా ప్రస్తుతం ఇంటర్ నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. వినోదం నుంచి ఉద్యోగం వరకు అన్ని రకాల పనులను స్మార్ట్ ఫోన్ లోనే చేసేస్తున్నారు. ఇక మొబైల్‌లో యాప్స్ కంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఎక్కువగా ఆధార పడుతున్నారు. ఫోన్‌పై స్టోరేజ్ విషయంలో ఎలాంటి భారం పడదనేది ఒక కారణమైతే సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చనే మరో కారణంతో వీటి వినియోగం పెరిగింది.
ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిందే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్‌కు చెందిన గూగుల్ డ్రైవ్. చాలా మంది ఎలాంటి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకున్నా వెంటనే.. గూగుల్ డ్రైవ్ నుంచి డాక్యుమెంట్లను యాక్సెస్ చేస్తున్నారు.అయితే ఇదే సమయంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఈ డ్యాక్యుమెంట్స్‌తో కొన్ని మోసపూరిత లింక్‌లను పంపుతూ ఫోన్‌లను హ్యాక్ చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి గూగుల్ ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది.
డ్యాక్యుమెంట్ల ద్వారా స్పైవేర్‌లను జొప్పించే ప్రమాదానికి చెక్ పెట్టడానికే గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. గూగుల్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్ సహాయంతో… మీ డివైజ్‌లోకి వచ్చిన ఏదైనా ప్రమాదరకరమై డాక్యుమెంట్ కానీ ఫోటోను మీరు ఓపెన్ చేసిన వెంటనే గూగుల్ స్కాన్ చేసి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. స్క్రీన్ పై భాగంలో సదరు డాక్యుమెంట్‌లో ఉన్న అనుమానాదస్పద విషయాన్ని అలర్ట్ రూపంలో చూపిస్తుంది. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.
Read Also : Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !
Tufan9 Telugu News And Updates Breaking News All over World