UPI Payments: యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాక భారతదేశం డిజిటల్ పేమెంట్లు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ప్రరీ ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎమ్ వంటి వాటిని వాడుతున్నారు. అయితే చిన్న చిన్న దుకాణాదారుల నుంచి బడా బడా షాపింగ్ మాల్స్ వరకు అంతా డిజిటల్ పేమెంట్లుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
అయితే యూపీఐ యూజర్లు బ్యాంక్ అకౌంట్ లో లింక్ చేసిన యూపీఐ యాప్ లను వినియోగించి బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపొచ్చు. అయితే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వాళ్లు కచ్చితంగా ఈ ఐదు విషయాలు తెలుసుకోవాల్సిందే. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మీ ఆరు లేదా నాలుగు అంకెల యూపీఐ పని నంబర్ ను ఎరితోనూ షేర్ చేయకూడదు. ప్రారంభ యాప్ ప్రతి లావాదేవికి ముందు పిన్ నంబర్ అడుగుతుంది మీరు మీ యూపీఐ బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసినప్పుడు… మీరు సీక్రెట్ పిన్ ని సెటప్ చేస్కోవాలి. ఆ తర్వాత పేమెంట్లు చేస్కోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అకౌంట్ నుంచి వేరే వాళ్లు డబ్బులు డ్రా చేయడం లేదా దోచేయడం వంటివి చేస్తుంటారు.