Washing machine: ప్రస్తుతం కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పనిసరిగా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఒకప్పుడు బట్టలు ఉతకాలంటే ఎంతో కష్ట పడేవారు. కానీ ప్రస్తుతం వాషింగ్ మెషిన్ వచ్చిన తరువాత బట్టలు ఉతకడం కూడా చాలా సులభంగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది ఇంటిలో బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ఉంటోంది. అయితే మనం బట్టలు ఉతికే సమయంలో కొన్ని తప్పులు చేయటం వల్ల వాషింగ్ మెషిన్ చాలా తొందరగా పాడైపోతుంది. వాషింగ్ మిషన్ పాడవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటి అనే విషయానికి వస్తే….
ప్రస్తుతం మార్కెట్లో మనకు 6,7,8 కిలోలు అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల వాషింగ్ మిషన్ లు అందుబాటులో ఉన్నాయి.అయితే మనం ఎన్ని కిలోలు సామర్థ్యం గల వాషింగ్ మిషన్ కొన్నామో అందుకు అనుగుణంగా మాత్రమే బట్టలు వేయాలి. అంతకు మించి అధిక సామర్థ్యం బట్టలు వేయడం వల్ల వాషింగ్ మిషన్ తొందరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక చాలామంది బట్టలు ఉతకడం కోసం డిటర్జెంట్ ఉపయోగిస్తారు. వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకడానికి డిటర్జెంట్ కి బదులు, లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించడం ఎంతో మంచిది. ఇలా లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించడం వల్ల వాషింగ్ మిషన్ ఎక్కువ కాలంపాటు మన్నిక ఉంటుంది.
ఇక వాషింగ్ మిషన్ ఎక్కువ కాలంపాటు మన్నిక రావాలంటే వారానికి ఒక్కసారైనా వాషింగ్ మిషన్ క్రియేట్ చేసి ఒక రోజు మొత్తం బాగా ఆరబెట్టాలి. ఇలా ఒక రోజు మొత్తం డ్రై గా ఉండడం వల్ల వాషింగ్ మిషన్ ఎక్కువ కాలంపాటు మన్నిక ఉంటుంది. కనుక వాషింగ్ మిషన్ ఉపయోగించే వారు ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల వాషింగ్ మెషిన్ ఎక్కువరోజులు ఉపయోగించవచ్చు.