...

Andorid Users Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. ఈ 4 విషయాల్లో జర జాగ్రత్త!

Andorid Users Alert : ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. ఈ నాలుగు విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటే చిక్కుల్లో పడతారు.. పొరపాటున కూడా ఈ తప్పులు అసలే చేయొద్దు.. చాలామంది ఆండ్రాయిడ్ యూజర్లు తమకు తెలియకుండానే ఈ తప్పులు చేస్తున్నారు. ఇంతకీ ఏంటా ఆ తప్పులు అంటారా? దాదాపు అందరూ చేసే కామన్ మిస్టేక్స్… మీ ఫోన్ సెక్యూరిటీ కోసం మీరు చేస్తున్న వాటిలో ఇవే కామన్ తప్పులుగా చెప్పొచ్చు.. అవేంటో ఓసారి చూద్దాం..

ఫోన్ లాక్ సింపుల్ పాస్ వర్డ్ పెట్టడం :
చాలామంది చేసే కామన్ మిస్టేక్ ల్లో ఇదొకటి.. గుర్తుండేలా సింపుల్ పాస్ వర్డ్ పెట్టేస్తుంటారు. ఫోన్ లాక్ విషయంలో ఇలాంటి సులభమైన పాస్ వర్డ్ లను పెట్టుకోవడం మంచిదికాదు.. ఆండ్రాయిడ్ యూజర్లలో చాలామంది ఇలాంటి పాస్ వర్డులనే పెట్టుకుంటుంటారు. ఫింగర్ ఫ్రింట్, ఫేస్ అన్ లాక్ వంటి పాస్ వర్డ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అందుకే ఈ పాస్ వర్డులను ఎంచుకుంటుంటారు. స్ట్రాంగ్ పాస్ వర్డులను పెట్టుకోవడం ఎంతైనా అవసరం.. నెంబర్ పాస్ వర్డులను పెట్టుకోండి. లెటర్, నెంబర్ మిక్సింగ్ పాస్ వర్డులను పెట్టుకోండి.

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్‌లోడ్ చేయొద్దు..
ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం సెక్యూరిటీపరంగా చాలా మంచిది. కానీ, థర్డ్ పార్టీ యాప్స్ APK ఫైల్స్ ఇతర వెబ్ సైట్లో నుంచి డౌన్ లోడ్ చేస్తుంటారు. ఇదంతా సేఫ్ కాదు.. ఈ యాప్స్ లో వైరస్ వంటి మాల్ వేర్ ఉంటాయి. మీ ఫోన్లోకి హానికరమైన వైరస్ ప్రవేశించే ప్రమాదం ఉంది. మీ ఫోన్ సెట్టింగ్స్ లోని యాప్ మెనూ (App Menu)లో Unknown Apps Instalation ఆప్షన్ OFF చేయాలి.

యాప్ ఇన్‌స్టాల్ పర్మిషన్స్ ఇవ్వొద్దు :
ఏదో ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకుంటారు. ఆ యాప్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు అడుగుతుంది. ఫోన్ కాంటాక్ట్ లిస్ట్, మెసేజెస్, స్టోరేజీ వంటి అనుమతిని అడుగుతాయి. మీకు అవసరం లేని యాప్స్ అన్నింటికి పర్మిషన్ ఇవ్వకూడదు. లేదంటే మీ విలువైన డేటా ఫేక్ యాప్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది జాగ్రత్త.. మీ ఫోన్ హ్యాక్ చేస్తారు.

యాప్ APK ఫైల్ ద్వారా ఇన్‌స్టాల్ చేయడం :
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే ఏదైనా యాప్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఇందులో దాదాపు సురక్షితమైనవే ఉంటాయి. ప్లే‌స్టోర్‌లో లేని ఎన్నో యాప్స్ ఇతర సైట్లలో లభిస్తుంటాయి. అనవసరంగా APK ఫైల్ డౌన్‌లోడ్ చేసుకొని ఇబ్బందుల్లో పడొద్దు.. ఇలాంటి యాప్స్ చాలా డేంజరస్.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోకూడదు.

Read Also : Whatsapp Profile Hide Trick : మీ వాట్సాప్ ప్రొఫైల్‌లో పేరు కనిపించకుండా ఇలా చేయొచ్చు..!