Amazon Great Republic Sale : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ కు రంగం సిద్ధమైంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న సేల్ 22 వరకు కొనసాగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 16 అర్ధరాత్రి 12 గంటల నుంచి సేల్ అందుబాటులోకి వస్తుంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ, ఎస్సెన్షియల్, హోమ్ అండ్ కిచెన్, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు,డైలీ ఎస్సెన్షియల్ వంటి వాటిపై భారీ రాయితీలు ప్రకటించింది.వాటితో పాటు బ్యాంకు డిస్కౌంట్ లు కూడా తీసుకొచ్చింది. ఎస్ బిఐ క్రెడిట్ కార్డు,ఈఎంఐ లావాదేవీలపై 10% తక్షణ రాయితీ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది.
బజాజ్ ఫిన్ సెర్వ్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే లెటర్ తో పాటు ఎంపికచేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల పై నో కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉంది. బ్యాంకు రాయితీలతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా వినియోగదారులు 16 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
అలాగే 8 భారతీయ భాషలు, మరాఠీ, హిందీ,బెంగాలీ,కన్నడ, తెలుగు,తమిళం, మలయాళం భాషల్లోనూ షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా మంచి షాపింగ్ అనుభవం కావాలంటే దగ్గరలోని అమెజాన్ స్టోర్ ను సందర్శించవచ్చని అమెజాన్ తెలిపింది.వన్ ప్లస్, షియోమి, శాంసంగ్, యాపిల్ వంటి బ్రాండెడ్ ఫోన్ లపై వినియోగదారులకు భారీ రాయితీలు లభించనున్నాయి. అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీ అప్లియన్సెస్ పైన భారీ రాయితీలు లభించనున్నాయి.
Read Also : Vastu Tips : మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటే ఈ వాస్తు చిట్కాలను ఫాలో అవ్వండి…