...

Balayababu : బాల‌య్య‌కు రాజ‌కీయాల్లో ఆస‌క్తి లేదా?

Balaya babu : ఎన్ని ఏండ్లు రాజ‌కీయాల‌లో ఉన్నా బోరు కొట్టే ప‌రిస్థితి ఉండ‌దు. ఎన్నిసార్లు కుర్చీని ఆధిరోహించినా ద‌హ‌నం తీరాదు. రాజీయాల‌కు రిటైర్మెంట్ ఉండ‌దు. 90 ఏండ్లు నిండిన వారు కూడా రాజ‌కీయాల్లోక‌నిపిస్తారు. నంద‌మూరి బాలకృష్ణ అటువంటి రాజ‌కీయాల ప‌ట్ల అస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇటివ‌ల కాలంలో ఏపీలో ఇలాంటి రాజ‌కీయాలు క‌నిపిస్తున్నాయి. అందుటో టీడీపీ కార్యాల‌యంపై దాడులు జ‌రిగే ఆ పార్టీ నేత‌లు మండిపోయ్యారు. ఏకంగా ఒక్క రోజు వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు.

తెలుగు దేశంలో యాక్టివ్‌గా లేని వారు కూడా చంద్ర‌బాబు చేప‌ట్టిన దీక్షా స్థ‌లిని వ‌చ్చి,అధికార వైసీపీ మీద నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దీక్షా చేస్తుంటే బాల‌య్య మాత్రం అక్క‌డ క‌నిపించ‌లేదు. ఈ విష‌యంగా గురించి బాగా ఆలోచించాల‌ని అంటున్నారు. ఇటివ‌ల హిందూపురంలో బాల‌య్య కార్యాల‌యంపైన దాడి జ‌రిగింది. కానీ బాల‌య్య మాత్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అయితే బాల‌య్య ఎందుకు మౌనంగా ఉన్నార‌నే సందేహం అంద‌రిలో మొద‌లైంది. అంతేకాదు బాల‌య్య వ‌రుస బెట్టి సీనిమాలు చేస్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశంలో ప్ర‌తి ప‌క్ష తెలుగు దేశం పార్టీ అదినేత చంద్ర‌బాబు పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌న వ‌య‌సు స‌హ‌క‌రించ‌పోయిన పార్టీ కోసం ప‌ని చేస్తున్నారు. కానీ బాల‌య్ మాత్రం సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. అయితే బాల‌య్య వైఖ‌రిపై పార్టీలో అంద‌రికి అనుమానాలు వ‌స్తున్నాయి.కానీ బాల‌య్య‌కు మాత్రం రాజ‌కీయాల ప‌ట్ల అస‌క్తి క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

అల్లుడు నారా లోకేష్‌, బావ చంద్ర‌బాబు బాల‌య్య‌కు అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. 2014లో హిందూపురం నుంచి బాల‌య్య విజ‌యం సాధించినా ఐదేండ్లుగా ఆయ‌న‌ను ఎమ్మెల్యేగానే ఉంచారు. రానున్న రోజు టీడీపీ మ‌ళ్లి ఏపీలో అధికారంలోకి వ‌స్తే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నే గ్యారంటి ఏమి లేదు. టీడీపీలో చంద్ర‌బాబు, లోకేష్ కు మాత్ర‌మే ప‌ద‌వులు ఉంటాయి. బాల‌య్య‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తే కుటుంబంలో ముగ్గురికి ప‌ద‌వులు ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు.
Read Also : Pawan Kalyan : ప‌వ‌న్ కామెంట్స్ వైసీపీ మేలు కోస‌మేనా?