...

TRS vs BJP : తిరిగి తెరాసలోకి ఈటల రాజేందర్.. కేటీఆర్ స్పందన!

TRS vs BJP : దేశంలోని అన్ని వ్యవస్థల్లాగే ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ గుప్పిట పెట్టుకుందని, ప్రధాని మేదీకి దమ్ము ఉంటే తెలంగాణలో ముందుస్తు ఎన్నికలకు ఆదేశించాలని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వేలు చేసేంత సీన్ రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కి లేదని విమర్శించారు. అయినా ఏ పార్టీ సర్వే చేసినా అందులో తెరాస గెలుస్తుందనే విషయమే బయటకొస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సై అంటే అసెంబ్లీని ఇప్పుడే రద్దు చేసేందుకైనా సీఎం కేసీఆర్ రెడీ అని తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురై హుజూరాబాద్ లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ లోకి చేరుతారనే ఊహాగానాలపై కేటీఆర్ స్పందించారు.

దక్షిణాదిలో సీఎం కేసీఆర్ సాధించబోయే సంచలన రికార్డుపైన మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. అలాగే రాష్ట్రంలో రాబోయ్యే ఎన్నికల్లో విజయం సాధించేది తమ పార్టీయోనని వెల్లడించారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయమని వివరించారు. త్వరలోనే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. వానలు, వరదలతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే సాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం… ఉపాధి హామీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాష్ట్రానికి బృందాలను పంపారని విమర్శించారు.