Junior NTR Political Entry
JR NTR Political Entry : ఏపీ రాజకీయవర్గాల్లో (AP Politics) ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ రాక ఎప్పుడా అని తెలుగు తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీనియర్ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటాలంటే దానికి మంచి చరిష్మా ఉన్న నాయకుడు కావాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాటలను ఏపీ ప్రజలు విశ్వసించడం లేదు.
ఎన్టీఆర్ రాక కోసం ఎదురుచూపులు :
ఎన్నికల్లో ఇచ్చే హామీలను జనం సీరియస్‌గా తీసుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే ఆ పార్టీకి భవిష్యత్ ఉంటుంది. లేకపోతే పాతాళానికి కూరుకుపోతుంది. సీఎం జగన్ కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలహీనంగా మార్చాలని చూస్తున్నట్టు చర్చ నడుస్తోంది.ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వపు రోజులను తీసుకొచ్చేందుకు తెలుగు తమ్ముళ్లు గ్రూపులు కట్టి మరీ జూనియర్ ఎన్టీయార్‌ను ఎన్నికల ప్రచారానికి పిలిచేందుకు సిద్దం అయ్యారని తెలుస్తోంది.
Ys Jagan: 2024 ఎన్నికల్లో జగన్ సరికొత్త నినాదం.. మరోసారి అధికారంలోకి రావడం ఖాయం?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం దిశగా అడుగు పడాలంటే అందుకు సమర్థుడైన నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన వస్తేనే తెలుగుదేశానికి పూర్వవైభవం వస్తుందని, లేదంటే తెలుగుదేశం పార్టీపై విశ్వసనీయ తగ్గిపోయే ప్రమాదం ఉందనే అభిప్రాయపడుతున్నారు.
ఏదిఏమైనా జూనియర్ ఎన్టీఆర్ రాకతో అటు తెలుగుదేశంతో పాటు ఏపీ ప్రజల్లో కొత్త నాయకుడు వచ్చాడనే భావన కలుగుతుందని అంటున్నారు. అదేగానీ జరిగితే తెలుగుదేశం పార్టీకి మరింత ప్లస్ అవుతుందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను టీడీపీ తరపున వచ్చే ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దింపాలనే డిమాండ్ వినిపిస్తోంది.
జూనియర్‌కు పార్టీ అంటే ఎనలేని ప్రేమ..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎందుకో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మీ రాజకీయ ఎంట్రీ ఉంటుందా అని మీడియా ఎన్నిసార్లు అడిగినా దానికి ఇది సమయం కాదని దాటవేస్తూ వచ్చారు జూనియర్. కానీ, ఆయనకు తన తాత, సీనియర్ ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అంటే ఎనలేని ప్రేమ. ఆ పార్టీ పది కాలాల పాటు బాగుండాలని యంగ్ టైగర్ కోరుకుంటారట..
జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీకి భవిష్యత్తు..
2019 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీయార్ రావాలని చాలా మంది అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగు తమ్ముళ్లు (TDP Leaders) కూడా అదే కోరుకుంటున్నారని చంద్రబాబుకు తెలిసింది. పార్టీకి పై జూనియర్‌కు ఉన్న ప్రేమ కూడా బాబుకు కలిసివచ్చే అవకాశం ఉంది. అందుకోసమే ఆయన పక్కాగా జూనియర్‌ను ప్రజాక్షేత్రంలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది.
Horoscope Today : ఈ రాశుల వారికి బ్యాడ్ టైం నడుస్తుందట.. కొత్త చిక్కులు, అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం
జగన్ ప్రభుత్వం ఇటీవల సినీ పరిశ్రమను టార్గెట్ చేసింది. సినిమా టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని చూడటం.. స్పెషల్ షో, బెనిఫిట్ షోలను రద్దు చేయాలని నిర్ణయించడం సినీ పరిశ్రమకు నచ్చలేదు. ఈ విషయంపై కూడా కొందరు సినీ పెద్దలను ఎన్టీఆర్ వద్దకు పంపాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇకపోతే సీనియర్ ఎన్టీయార్‌తో అనుబంధం ఉన్న కొందరు సీనియర్ నేతలను కూడా ఎన్టీఆర్ (JR NTR) వద్దకు పంపాలని బాబు నిర్ణయించినట్టు తెలిసింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించి పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మాజీ సీఎం చంద్రబాలు గట్టి ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై యంగ్ టైగర్ ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
Samantha : క్షమించరాని తప్పులు చేసిన చైతూ.. సామ్ ఫ్యాషన్ డిజైనర్ సంచలన కామెంట్స్.. అందుకే విడిపోయారట!
Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…
Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…
Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…
WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…
TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…
Malabar Spinach : మలబార్ పాలకూర ఎప్పుడైనా తిన్నారా? ఈ పాలకూరనే బసెల్లా ఆల్బా, వైన్ పాలకూర, ఇండియన్ పాలకూర…
This website uses cookies.