AP-Telangana issue: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవ.. 5 గ్రామాలు మావంటే, మావంటూ!

AP-Telangana issue: ఐదు గ్రామాలు.. మహాభారత యుద్ధానికి దారి తీసిన ప్రస్తావన ఇది. ఇప్పుడే అదే పదం తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తోంది. భద్రాచలాన్ని గోదావరి ముంచెత్తడంతో.. ఆ ఐదు గ్రామాల ప్రస్తావన తెర మీదు వచ్చింది. ఇంతీ ఆ ఐదు గ్రామాలు కావాలని తెలంగాణ ఎందుు కోరుతుంది. ఇప్పుడు అపీ రియాక్షన్ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల…. ఈ ఐదు గ్రామాల గురించి ఏపీ, తెలంగాణల మధ్య గొడవ చెలరేగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట విభజన తర్వాత… పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండాలలను ఏపీలో కలిపేశారు. అందులో భాగమే ఈ ఐదు గ్రామ పంచాయతీలు. ఈ ఐదు ఊర్లు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలను… అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు.. అశ్వారావుపేట పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఇలా ఈ ఐదు గ్రామాలు ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయి.

పోలవరం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. అందుకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి కాపాడేందుకే, కరకట్ట నిర్మించేందుకే ఇలా అడుగుతున్నాననేది మంత్రి వాదన. అయితే ఈ విషయానికి చాలా మంది సపోర్ట్ చేయడంతో ఈ ఐదు గ్రామాలు మాకే కావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.

Advertisement