Chandrababu : రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబు ఎలాగైనా 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తరలకు, కీలక నేతలకు పిలుపునిచ్చారట.. తాను సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన చంద్రబాబు తన శపథాన్ని గుర్తు తెచ్చుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.ఇకపై పార్టీలో బుజ్జగింపులు, జంపింగులను ప్రోత్సహించనని.. కష్టపడి పనిచేసేవారికి పదవులు అని సూటిగా చెప్పేశారట..
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ముందుగా పార్టీలో సంస్థాగత మార్పులు చేయాలని చంద్రబాబు నిర్ణయించారట.. అందుకోసం రహస్య సర్వే కూడా చేయించుకున్నట్టు సమాచారం. దీనిప్రకారం.. ఎవరు పార్టీకి విధేయులుగా ఉన్నారు. కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. వేరే పార్టీలవైపు ఎవరు చూస్తున్నారు. పార్టీ పై, సీనియర్ నేతల పరువు తీసేలా.. ప్రజల్లో పార్టీకి మచ్చ తెచ్చేలా ఎవరు ప్రవర్తిస్తున్నారనే ప్రతి చిన్న విషయాలను సైతం బాబు సర్వే ద్వారా రిపోర్టు తెప్పించుకున్నారని తెలిసింది. దీని ప్రకారం పార్టీ ఎదుగుదలకు, మనుగడకు పనికిరాని వారిని ఏరివేసేందుకు చర్యలు ప్రారంభిచారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు చెందిన ముగ్గురు నేతలను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిసింది. నెల్లూరులో మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ నేతలే అధికార పార్టీకి కొమ్ము కాసి పార్టీ ఓటమికి కారణమయ్యారని ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా వారికి భజన చేసే లీడర్లకు టిక్కెట్లు ఇచ్చి నిజాయితీగా పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వలేదని తెలిసింది.
అందువల్లే నెల్లూరులో పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అందుకే ఆ ముగ్గురు నేతలపై ప్రస్తుతానికి చంద్రబాబు సస్పెన్షన్ బాణం విసిరారు. దీంతో మిగతా నేతలకు ఒక వార్నింగ్ మెసేజ్ పంపించారు. ఇదే దూకుడుతో బాబు ముందుకు సాగితే రానున్న రెండేళ్లలో పార్టీకి మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుందని కొందరు అనుకుంటున్నారు.
Read Also : Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!
Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…
Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…
Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…
Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
This website uses cookies.