Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే ఉంటాం. మన శరీరం చురుకుగా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. నీరు మన శరీరానికి తక్షణ శక్తిని అందించే ఖనిజం. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగిస్తుంది. నీరు లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. ఈ విషయం తెలిసినా చాలా మంది తక్కువ నీళ్లను తాగుతున్నారు.
దీని కారణంగా, వారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అనేక తీవ్రమైన వ్యాధులు శరీరాన్ని చుట్టుముడతాయి. నీటి కొరత వల్ల మీకు కిడ్నీలో (avoid kidney stones) రాళ్ల సమస్యకు దారితీస్తుందని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి అతి పెద్ద కారణం తక్కువ నీరు తాగడమే. నీటి కొరత ఎందుకు మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వ్యక్తులు రోజుకు ఎంత నీరు తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. సోడియం, కాల్షియం, ఇతర సూక్ష్మ కణాలను మూత్రనాళం ద్వారా శరీరం నుంచి తొలగిస్తాయి. కానీ, ఈ ఖనిజాలు మన శరీరంలో అధికంగా మారినప్పుడు, కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవు. వాటిలో పేరుకుపోయి రాళ్ల మాదిరిగా మారిపోతాయి.
కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం :
తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడటమే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్య వేగంగా పెరుగుతుంది. వాస్తవానికి, తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని లవణాలు, ఖనిజాలు స్ఫటికాలుగా మారుతాయి. తద్వారా రాళ్లంగా మారిపోతాయి. దాంతో కడుపు నొప్పికి కారణమవుతుంది. కొన్నిసార్లు మూత్రవిసర్జనలో ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది.
రోజుకు ఎంతమొత్తంలో నీరు తాగాలంటే?:
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా ఫ్యామిలీ హిస్టరీలో మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు రోజుకు కనీసం 2 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలి. పొలంలో పనిచేస్తే ఇంకా ఎక్కువ తాగాలి. అలాగే ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. చికెన్, మాంసం తక్కువగా తినండి. ఎక్కువ నీరు తాగడం ద్వారా మూత్రపిండాలు ఈ ఖనిజాలను ఫిల్టర్ చేస్తాయి. దీని కారణంగా రాళ్ళు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
Read Also : Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..
Weight Loss Drink : ప్రస్తుత ఆధునిక జీవితంలో శరీరానికి శ్రమ తక్కువ.. దాంతో చాలామంది ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు…
76th Republic day 2025 : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం.. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ…
Shattila Ekadashi 2025 : ప్రతి ఏడాది పుష్యమాసంలో కిష్ణ పక్షంలో షట్టిల ఏకాదశి వస్తుంది. ఈ ఏడాది జనవరి…
Keerthy Suresh : తెలుగుసినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించింది తక్కువ…
Virender Sehwag Divorce : భారత క్రికెటర్ల విడాకుల వార్త ఈరోజుల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా యుజ్వేంద్ర చాహల్,…
Budget 2025 : ప్రతి ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేపెట్టడం ఆనవాయితీ. గతంలో ఫిబ్రవరి…
This website uses cookies.