Actress Priyanka Jaywalkkar : క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లిళ్లు మనం చాలానే చూస్తుంటాం. ఏదో ఒక ఈవెంట్ లేదా యాడ్స్ లో నటిస్తున్నప్పుడు కలుసుకోగా… వారి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అలాగే విరాట్ కోహ్లీ, అనుష్క కలిశారు.
తాజాగా ఓ యంగ్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్, టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌తో ప్రేమాయణానికి సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉంది.. అందరూ ఇలా ఎందుకు అనుకుంటున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకొని ఒక ఫొటోను షేర్ చూసింది. ఈ ఫొటోకు క్రికెటర్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేయగా… ప్రియాంక ఎవరు నువ్వా అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఈ కామెంట్లు చూసిన వారంతా… వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై వారిద్దరిలోఎవరో ఒకరు స్పందిస్తే తప్ప మనకు విషయం తెలియదు.
Read Also : Shankar Ram Charan : పొలిటిషియన్ లుక్‌లో సైకిల్‌పై రామ్ చరణ్.. ఫొటో లీక్..!