Radhe Shyam: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీ థియేటర్లు విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రికార్డులను దక్కించుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన 8 గంటల 22 నిమిషాలకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకొని రికార్డును సృష్టించింది.
ఈ విధంగా అమెజాన్ ప్రైమ్ లో పుష్ప సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేదు.అయితే గత నెల 11వ తేదీ పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిల పడిపోయింది.
ఇక ఈ సినిమా ఫ్లాప్ గా నిలబడటంతో ఈ సినిమా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే థియేటర్ లో చూడని ఎంతోమంది అభిమానులు పెద్ద ఎత్తున ఈ సినిమాని ఓటీటీలో చూస్తూ మంచి విజయాన్ని అందించారు. ఈ క్రమంలోని ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమైన 2 గంటల 5 నిమిషాలకే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకొని పుష్ప సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఇలా థియేటర్ లో విజయం సాధించలేకపోయిన ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.