...

Ashu Reddy: డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి… కాబోయే వాడి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అషురెడ్డి!

Ashu Reddy: అషురెడ్డి ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.గతంలో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దుగుమ్మ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ కంటెస్టెంట్ అఖిల్ తో పులిహోర కలపడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ కి వెళ్లక ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా అషు చేసిన బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Advertisement
Ashu Reddy
Ashu Reddy

ఇక తనకు కాబోయే వాడిని వెతకడం కోసం బిగ్ బాస్ హౌస్ ను వాడేస్తానని ఈమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. అదేవిధంగా తనకు కాబోయే వాడికి ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలో కూడా అషురెడ్డి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. ఇక తనకు వంట చేయడం కొద్ది కొద్దిగా మాత్రమే వచ్చాయని అందుకే తనకు కాబోయే వాడికి వంటలు చేయడం వచ్చి ఉండాలని తెలిపారు. అదేవిధంగా తను పెళ్లి చేసుకోబోయే వారికి డ్రైవింగ్ వచ్చి ఉండాలని కూడా అషు రెడ్డి వెల్లడించారు.

Advertisement

ఇక ఇలా తన కాబోయే వాడికి డ్రైవింగ్ వచ్చి ఉండాలని చెప్పడంతో వెంటనే పటాస్ హరి స్పందిస్తూ అదికూడా ఒక క్వాలిటీ నా? పెళ్లయిన తర్వాత నువ్వే డ్రైవింగ్ నేర్పించవచ్చు కదా? కొంపదీసి డ్రైవర్ ని కనుక పెళ్లి చేసుకుంటున్నావా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు
అషురెడ్డి సమాధానం చెబుతూ డ్రైవర్ ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ప్రేమ ఎప్పుడైనా ఎక్కడైనా పుట్టొచ్చు అంటూ అషురెడ్డి సమాధానం చెప్పారు.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Read Also Ashu Reddy: అషు రెడ్డి మొహంపై ఉమ్మిన యాంకర్ చైతూ.. కారణం అదే!:

Advertisement
Advertisement