Guppedantha Manasu April 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు క్లాస్ కి లేట్ గా వచ్చింది అని పనిష్మెంటు ఇస్తాడు రిషి.
ఈరోజు ఎపిసోడ్ లో నైట్ నీ ఫోన్ ఎందుకు బిజీ వచ్చింది అని రిషి, వసు నీ అడగగా అప్పుడు వసు మీ అమ్మగారు కాల్ చేశారు అని అంటుంది. ఇక ఆ తర్వాత వసు, రిషి, జగతి, మహేంద్ర లు కారులో బయటకు వెళ్తారు. అప్పుడు కారు లో వెనక జగతి, మహేంద్ర, వసు కూర్చొని ఉండగా అప్పుడు రిషి తాను క్యాబ్ డ్రైవర్ గా ఫీల్ అవుతాడు.
రిషి వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. అలా వెళ్తున్న క్రమంలో రిషి కావాలనే గట్టిగా ఒక బ్రేక్ వేస్తాడు. వెంటనే వసు, రిషి దగ్గరకు వస్తుంది. అప్పుడు వసు, రిషి కీ కోపం వచ్చింది అని గ్రహించుకుంటుంది. వారందరు కలిసి వసు రూమ్ కీ వెళ్తారు.
వసు రూమ్ కీ వెళ్తున్న క్రమంలో వసు జారీ పోతుండగా రిషి పట్టుకుంటాడు. అలా వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర కాస్త గొంతు సవరించుకున్నట్లు అనడంతో వారిద్దరూ ముందరికి వెళ్తారు. వసు రూమ్ దగ్గరికి వెళ్లిన తర్వాత జగతి మేడం మీరు చెప్పాలి అని అంటాడు రిషి.
ఆలిండియా లెవల్లో స్కాలర్ షిప్ టెస్ట్ జరగబోతోంది అందులో కచ్చితంగా వసు పాస్ అవ్వాలి అని అంటాడు. ఆ తర్వాత రిషి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అప్పుడు వసు ఇన్ని రోజులకు మళ్లీ నేను స్టూడెంట్ అవుతుంది అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని జగతి తో అంటుంది.
ఇక మరొక వైపు దేవయాని, ధరణి పై విరుచుకుపడుతూ ఉంటుంది. ఇంతలో జగతి, మహేంద్ర, రిషి కలిసి రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు రిసి పై కావాలనే దొంగ ప్రేమ ఒలకబోస్తుంది. ఇక రిషి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లారు మహేంద్ర అని దేవయాని అడగగా కాలేజీ పని మీద వెళ్ళాము అని అంటాడు మహేంద్ర.
ఆ పనేదో మీరే చేయొచ్చు కదా అని, కొన్ని పనులు రిషి నే చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జగతి, మహేంద్ర. వారిపై కోపంతో రగిలి పోతూ ఉంటుంది దేవయాని. ఇక రేపటి ఎపిసోడ్ లో దేవయాని ఒక వ్యక్తికి ఫోన్ చేసి వసు సంగతి చూడమని చెబుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also :Guppedantha Manasu : దగ్గరవుతున్న రిషి,వసు..వసు కెరిర్ పై ద్రుష్టి పెట్టిన రిషి..?