Uday Kiran : ఉదయ్ కిరణ్ ఈ పేరు తలుచుకుంటేనే ఇప్పటికీ గుండె తరుక్కుమంటుంది.ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి కాకుండా సొంత టాలెంట్ తో అడుగు పెట్టిన మొదటి సినిమా చిత్రంతోనే ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అనంతరం ఆయన తిరిగి తేజ గారితోనే నువ్వు నేను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి సినిమాని మించి హిట్ అవ్వడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఉదయ్ కిరణ్ వైపు చూసింది.
నువ్వు నేను తర్వాత మనసంతా నువ్వే వంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరో అయ్యారు. ఈయన నటించిన మూడు సినిమాలు వరుసగా హిట్ కావడంతో ఎన్నో బడా బ్యానర్లు సైతం ఆయనకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి తనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ఈయన ఇండస్ట్రీలో ఎంత తొందరగా అయితే ఎదిగారో అంతే తొందరగా ఈయన పతనం కూడా మొదలైంది. ఉదయ్ కిరణ్ నటిస్తున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఫ్లాప్ కావడంతో ఆయన కెరియర్ పూర్తిగా కిందపడిపోయింది.
సినిమా ఇండస్ట్రీలో ఇలా హిట్ ఫ్లాప్ లు రావడం సర్వసాధారణం. అయితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోతే ఇతర వ్యాపారాలు, పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ మాత్రం తన చావే అన్ని సమస్యలకు పరిష్కారం అని భావించారు. అందుకే ఈయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు మరణించినప్పటికీ ఇప్పటికీ వారి డెత్ మిస్టరీ ఏంటో తెలియడం లేదు. అయితే ఇండస్ట్రీకి చెందిన ఒక ప్రముఖ నటుడి పై ఆరోపణలు చేయడం కోసం ఉదయ్ కిరణ్ మరణ ఘటన ఎప్పటికప్పుడు ప్రచారంలోకి వస్తోంది.ఒకవేళ ఈయనకు అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు ఈయన మరణం గురించి చింతిస్తున్న సినీప్రముఖులు ఎక్కడికి వెళ్లారు? వీళ్ళందరూ ఉదయ్ కిరణ్ ని ఎందుకు ఆదుకోలేదు? ఉదయ్ కిరణ్ కు ఆయన కుటుంబసభ్యులకు అండగా నిలవలేదా? స్నేహితులు కూడా ఆయనను పూర్తిగా పక్కన పెట్టారా?ఇలా నిత్యం ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నప్పటికీ వీటికి ఇంత వరకు సరైన సమాధానం దొరకకపోవడంతో ఉదయ్ కిరణ్ మరణం వెనుక ఏం జరిగిందనే సందేహం అలాగే ఉంది.
Read Also : Puri jagannath: బండ్లన్నకు పూరీ జగన్నాథ్ గట్టి వార్నింగ్.. నాలుక కొరికేస్కో అంటూ సెటైర్లు!
Tufan9 Telugu News And Updates Breaking News All over World