Sonam Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. దిల్లీలోని ఆమె ఇంట్లో నగదు, విలువైన ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే వాటి విలువ సుమారు రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అయితే చోరీ ఫిబ్రవరిలోనే జరిగినప్పటికీ… ఇది ఆలస్యంగా వెలుగులోకొ వచ్చింది. అప్పుడే కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు.. కేసును చాలా గోప్యంగా ఉంచి దర్యాప్తు చేశారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
దిల్లీలోని సోనమ్ కపూర్ ఇంట్లో చాలా మంది పని చేస్తున్నారు. అయితే వారిలో 25 మంది ఉద్యోగులతో పాటు తొమ్మిది మంది కేర్ టేకర్స్, మరికొంత మంది డ్రైవర్లు, తోట మాలి, ఇతర పని వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలీదు కానీ… ఒకరోజు అల్మారాలోని నగలు, డబ్బు తనిఖీ చేసినప్పుడు దొంగతనం జరిగిందన్న విషయం అర్థమైనట్లు సోనమ్ కపూర్ కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారట. విషయం తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే సోనమ్ కపూర్ ఇప్పుడ గర్భవతి. ప్రస్తుతం ఆమె తన తల్లి వద్ద ఉంటోంది. దిల్లీలో ఆమె భర్త.. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.
Read Also : Four days work: వారంలో 4 రోజులే పని.. ఆవిధానం వైపే అందరి మొగ్గు