...

Tirumala: శ్రీవారి భక్తులకు గమనిక… ఈనెల 29వ తేదీ స్వామివారీ దర్శనాలు రద్దు!

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు గమనిక. ఈనెల 29వ తేదీ స్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు వెల్లడించారు.గత కొద్ది రోజుల క్రితం మూడు నెలల పాటు స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే 29వ తేదీ స్వామి వారి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈనెల 29వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కారణంగా స్వామివారి దర్శనాలు రద్దు చేయడం జరిగింది అయితే భక్తులు ఎవరో కూడా 28వ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించేది లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక భక్తుడు నుంచి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

30వ తేదీ నుంచి యధావిధిగా స్వామి వారి దర్శనాలు జరుగుతాయి అలాగే ఉగాది పండుగ సందర్భంగా స్వామివారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టికెట్లు విడుదల సమయంలోనే వెల్లడించారు. ఇక స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని, కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్, కరోనా నెగిటివ్ రిపోర్ట్ తీసుకురావాలని అధికారులు భక్తులకు సూచించారు.