Akkineni Family : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబంలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.కెరియర్ పరంగా ఎంతో మంచి జీవితాన్ని గడుపుతున్న అక్కినేని కుటుంబ సభ్యులు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి వారి వైవాహిక జీవితం మూడు రోజుల ముచ్చటగానే మిగిలిపోతుంది.

Akkineni Family
అక్కినేని నాగేశ్వర రావు కొడుకుగా నాగార్జున ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన మొదట దగ్గుబాటి వెంకటేష్ సోదరి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి నాగచైతన్య జన్మించిన తర్వాత పలు మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇకపోతే నాగార్జున మేనల్లుడు సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి కూడా కొన్ని రోజులకే పెటాకులైంది. కీర్తి రెడ్డి సుమంత్ ఇద్దరు విడాకులు తీసుకోవడంతో ప్రస్తుతం సుమంత్ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఇకపోతే సుమంత్ సోదరి సుప్రియ కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఈమె అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈమె కూడా పెళ్లి అయిన కొద్ది రోజులకే భర్తతో విడాకులు తీసుకొని ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇకపోతే నాగ చైతన్య సమంత జంట గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కూడా పలు మనస్పర్థల కారణంగా పెళ్లైన నాలుగు సంవత్సరాలకి విడాకులు తీసుకొని వెడిపోయారు. అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ తను ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న అఖిల్ సైతం కొన్ని కారణాలవల్ల తాను ప్రేమించిన యువతితో జరుపుకున్న నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇలా ఈ జంటలన్ని విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం ఆ కుటుంబానికి ఉన్న శాపమేనని తెలుస్తుంది. ఏది ఏమైనా కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన మీరు ఇలా విడిపోవడం ఎంతో బాధాకరమైన విషయం.
Read Also : Akkineni chaitanya : అక్కినేని నాగచైతన్య కాబోయే భార్య ఎవరో తెలుసా.. పెళ్లి డేట్ ఫిక్స్..!