Horoscope today : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి వారు ఎందుకంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తుల రాశి.. తుల రాశి వాళ్లు ట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కానీ ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఖర్చు చేసే ప్రతీ రూపాయి గురించి ముందుగా ఆలోచించాలి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లు మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయ్తనం చేస్తారు. ఆత్మ విశ్వాసం తగ్గకుండా చూస్కోవాలి. అందర్నీ కలుపుకొని పోవడం ఉత్తమం. శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు.
Read Also : Horoscope today: ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా సూపర్.. నక్కతోక తొక్కినట్టే!