Horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి లక్కే లక్కు..!

Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధిస్తారని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వృషభ రాశి.. వృషభ రాశి వాళ్లకు బ్రహ్మాండమైన విజయం ఉంది. ధర్మ మార్గంలో ప్రయత్నాలు సఫల అవుతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నిస్సంకోచంగా పనులు ప్రారంభించండి. ఆర్తిక స్థితి మెరుగు పడుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. చెడు ఆలోచనలను అస్సలే రానివ్వ వద్దు. ఒకవేళ వచ్చినా వాటి నుంచి దృష్టిని మరల్చుకోండి. సూర్య నమస్కారం శుభాన్ని ఇస్తుంది.

కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లు ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఒత్తిడిని దగ్గరకు రానీయకుండా ప్రసన్న చిత్తంతో పని చేయాలి. సమాజంలో గుర్తిపూ విశేషమైన కీర్తి లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వృద్ధి అధికంగా ఉంది. గతంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగుతాయి. విష్ణు స్మరణ మంచిది.

Advertisement