Tollywood divorced couple: జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. జీవితాంతం మనతోనే ఉంటారు అనుకున్న వారు కొన్ని సార్లు మన మొహం కూడా చూడకుండా వెళ్లిపోతారు. కారణం ఏదైనా కావొచ్చు కానీ కలిసుండకుండా మారొచ్చు. అయితే ప్రాణంగా ప్రేమించి.. పెళ్లి చేసుకొని… పలు కారణాల వల్ల ఒకరికొకరు దూరమయ్యే పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు స్నేహితులుగా ఉంటూ… భార్యాభర్తల బంధం నుంచి ఒకరికొకరు బై చెప్పుకుంటారు. ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న వాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఇలా ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన పది మంది జంటలు ఎవరో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
- అలనాటి నటి రేవతి, సురేష్ చంద్ర మీనన్ లు 1986లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీరిద్ధరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థల కారణంగా 2013లో విడిపోయారు.
- అలాగే 1984లో అక్కినేని నాగార్జున లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. 1990లో విడిపోయారు.
- హీరోయిన్ మమతా మోహన్ దాస్.. ప్రజీత్ పద్మనాభన్ ను 2011లో పెళ్లి చేసుకొని 2012లో విడిపోయారు.
- అలాగే అదితీ రావు హైదరి 2009లో సత్యదీప్ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లకే అంటే 2013లో విడాకులు తీసుకున్నారు.
- సైఫ్ అలీఖాన్, అమృతా సింగ్ ను 1991లో పెళ్లి చేసుకున్నారు. 2004లో వీరిద్దరూ విడిపోయారు.
- 1994లో అరవింద స్వామి, గాయత్రి రామమూర్తిని వివాహం చేసుకొని.. 2010లో విడిపోయారు.
- మంచు మనోజ్.. ప్రణతి రెడ్డి 2015లో వివాహం చేసుకొని.. 2019లో విడిపోయారు.
- పాప్ సింగర్ నోయల్.. నటి ఎస్తేర్ ను 2019లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఏడాదిలోపే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
- అలాగే సుమంత్.. 2004లో కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని తర్వాత రెండేళ్లకే అంటే 2006లోనే విడిపోయారు.
- నటుడు ప్రకాష్ రాజ్, నటి లలితలు కూడా ప్రేమించి 1994లో పెళ్లి చేసుకున్నారు. 2009లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్.
- చివరగా అక్కినేని నాగ చైతన్య, సమంతలు ఒకరికొనకు ప్రేమించుకొని 2017లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ 2021లో తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశఆరు.