Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో ఒక ఆఫీస్ లో తన చిన్నప్పటి ఫోటో ని చూసి షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా,సౌందర్యను ప్రశ్నిస్తూ హిమ గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా హిమ గురించి వివరాలు అడగగా నీకెందుకే అన్న విధంగా మాట్లాడుతుంది సౌందర్య. అప్పుడు వారిద్దరూ ఫన్నీగా పొట్లాడుకుంటారు.
అప్పుడు సౌర్య నేనే మనవరాలు అయితే ఏం చేస్తావ్ అని అడగగా.. నువ్వే నా మనవరాలు అయితే అమ్మ వెళ్ళిపో అని చెబుతాను నిన్ను ఐదు నిమిషాలే భరించలేకపోతున్నా అని అనడంతో అక్కడి సౌర్య నుంచి వెళ్లి పోతుంది. మరొకవైపు హిమ ఇంద్రమ్మ ఇంటి దగ్గర వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఇంతలో జ్వాల రావడంతో ఏంటి తింగరి ఇలా వచ్చావు అని నీతో మాట్లాడదాం అని వచ్చాను అని అంటుంది హిమ. అప్పుడు జ్వాలా ఎక్కడికైనా వెళ్దాం పద అని జ్వాలా ని వద్దులే డాక్టర్ సాబ్ తో కలిసి నాగార్జునసాగర్ కి వెళ్లి వద్దాం అని అనడంతో, అందుకు హిమ సరే అని అంటుంది.
ఆ తర్వాత హిమ ను దగ్గరకు పిలిచిన జ్వాలా, నా శత్రువుని నాకు దొరికి ఆసన్నమయింది అంటూ అసలు విషయాన్ని చెప్పడంతో హిమ షాక్ లో భయపడుతూ ఉంటుంది. మరోవైపు ప్రేమ్ ఫోన్లో హిమ ఫోటో చూసి మురిసి పోతూ ఉండగా ఇంతలో సత్య అక్కడికి వచ్చి, మీ అమ్మ నిరూపమ్ కీ పెళ్లి సంబంధం చూస్తుందంట అని చెప్పాడు.
మరొకవైపు స్వప్న, నిరూపమ్ కీ ప్రేమ గా బిర్యానీ వడ్డీస్తుంది. ఆ తర్వాత నిరూపమ్ నాగార్జునసాగర్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పగా అప్పుడు స్వప్న నువ్వు వెళితే నేను చచ్చినంత ఒట్టు అని అంటుంది. ఇక మరొకవైపు సౌందర్య హిమ కు పెళ్లి చేయాలి అని అంటుండగా ఇంతలో అక్కడికి హిమ వచ్చి నాకు పెళ్లి ఏంటి నేను సౌర్య దొరికేవరకు పెళ్లి చేసుకోను అని అంటుంది.
అప్పుడు సౌందర్య, సౌర్య దొరికేసింది అంటూ అసలు విషయం చెబుతుంది. సౌర్య ఈ భూమ్మీద ఎక్కడ ఉన్నా తెలుసుకొని మరి నీకు పెళ్లి చేస్తా అంటూ మాట ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో హిమ,జ్వాలా,నిరూపమ్ తో కలసి నాగార్జునసాగర్ కి వెళ్లడానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు నిరూపమ్ అక్కడికి వచ్చి నేను రావడం లేదు అని చెప్పడంతో వారిద్దరు డిసప్పాయింట్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.