హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సినిమా దగ్గర నుంచి షాపింగ్ వరకు ఏదైనా చేసుకోవచ్చు. కావాలంటే మీకు కావాలసిని వీడియోలన్నీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇతర సమాచారం, వినోదం ఇలా.. మీకు నచ్చినవన్ని వీక్షించొచ్చు. ఇందుకు అనుగుణంగా షుగర్ బాక్స్ సంస్థ మెట్రో రైళ్లలో తన హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను విస్తృత పరిచింది. 2019లోనే హైదరాబాద్ మెట్రోతో అనుసంధానమైన షుగర్ బాక్స్ సంస్థ ప్రస్తుతం అంతరాయం లేని హైస్పీడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
అమీర్ పేటలోని మెట్రో స్టేషన్ లో మంగళ వారం షుగర్ బాక్స్ సంస్థ తన డిజిటల్ హైస్పీడ్ కనెక్టివిటీ సేవలను ప్రవేశ పెట్టింి. ఇందుకు గాను పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్ మెంట్ సాంకేతికతను వినియోగించుకుంటున్నామని షుగర్ బాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. షుగర్ బాక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మెట్రో రైళ్లలో ఉచితంగా వినోద కార్యక్రమాలు వీక్షించే వీలు ఉందని అన్నారు.