సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా.. రమ్య కృష్ణ విలన్ గా ఓ కొత్త సినిమా రోబోతంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారుట. అలాగే సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోందట. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంబం కానుందని టాక్. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కుఫైనల్ టచ్ ఇవ్వడంతో పాటు నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట డైరెక్టర్ నెల్సన్. అయితే ఇందులో ఐశ్వర్య రాయ్, ప్రియాంక అరుల్ మోహన్ కీలక పాత్రలో నటించబోతుండగా… విలన్ గా రమ్య కృష్ణను తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇఫ్పటికే రమ్య కృష్ణను సంప్రదించగా… కథ నచ్చి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది.
రజనీ కాంత్, రమ్య కృష్ణ కాంబినేషనల్ వచ్చి సూపర్ డూపర్ హిట్టు అయిన నరసింహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంబరిగా రమ్య కృష్ణ కనబరిచిన అభినయం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. అయితే రజనీ ఆమె నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. అయితే మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందంటే అభిమానులంతా తెగ వేచి చూస్తున్నారు.