Karthika Deepam MAY 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ శోభ, స్వప్న ఇద్దరు హిమ దగ్గరికి వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న, శోభకు ఎంగేజ్మెంట్ వద్దు అనుకుంది తనే అని చెప్పడంతో అవునా అని అంటుంది శోభ. ఆ తర్వాత స్వప్న నిరుపమ్ ఎక్కడికి వెళ్ళాడు అని అడగగా కొద్దిసేపు ఆలోచనలో పడిన హిమ ఆ తర్వాత ధైర్యంగా బయటికి ఆటోలో వెళ్లాడు అది కూడా జ్వాలాతో కలిసి వెళ్ళాడు అని చెప్పడంతో శోభ, స్వప్న ఇద్దరు షాక్ అవుతారు.

Karthika Deepam MAY 24 Today Episode
మరొకవైపు జ్వాల,నిరుపమ్ ఇద్దరు ఆటోలో వెళ్తుండగా స్వప్న ఫోన్ చేసినా కూడా నిరుపమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తరువాత నిరుపమ్, జ్వాలా ఇద్దరూ కలసి అనాధాశ్రమం కి వెళ్తారు. అక్కడ అనాధ పిల్లలను చూసిన నిరుపమ్ బాధ పడతాడు. ఆ తరువాత వారిద్దరూ కూర్చొని ఆ అనాధాశ్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు జ్వాలా మాటలకు నిరుపమ్ ఆనంద్ పడుతూ నువ్వు చాలా గ్రేట్ అంటూ పొగుడుతాడు. అప్పుడు జ్వాలా,నిరుపమ్ మాటలకు ఆనంద పడుతూ ఉంటుంది. మరొకవైపు స్వప్న,శోభ,హిమ దగ్గర వుండి నిరుపమ్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా నిరుపమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఆ తరువాత స్వప్న,శోభనే నాకు కాబోయే పెద్ద కోడలు అని చెప్పడంతో హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
మరొకవైపు జ్వాలా అనాధాశ్రమం లో కూర్చుని మురిసిపోతూ ఉండగా ఇంతలో శోభ అక్కడికి వస్తుంది. ఇంతలో శోభ ని చూసిన నిరుపమ్ అక్కడికి వచ్చి ఆమెను హత్తుకుంటాడు. అప్పుడు నిరుపమ్,జ్వాలా ని పిలిచి శోభ కు పరిచయం చేస్తాడు. అప్పుడు శోభ ఆటో వాలా కి డాక్టర్ తో పరిచయం అని జ్వాలా ని ఇన్సల్ట్ చేస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో సౌందర్య,స్వప్న తీసుకున్న నిర్ణయం గురించి హిమ తో చెబుతుంది. ఆ తరువాత జ్వాలా ఏకంగా నిరుపమ్ ఇంటికి వెళ్ళి భోజనం ఇవ్వగా స్వప్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam May23 Today Episode : స్వప్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సౌందర్య.. జ్వాలను అవమానించిన శోభ..?