...

Mahesh babu: సినిమాల్లోకి సితారా… అసలు విషయం చెప్పేసిన సూపర్ స్టార్!

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట ఈ నెల 2న అంటే రేపే రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్ ను సంపాదించింది. అయితే తాజాగా సినిమాకు సంబంధించి డైరెక్టర్ పరుశురాం, మిల్క్ బాయ్ మహేష్ తో యాంకర్ సుమ ఓ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో మహేశ్ చాలా ఆసక్తికర విషాలను పంచుకున్నారు. ితార పెన్నీ సాంగ్ ప్రమోషనల్ వీడియోలో చేసిన సంగతి… ప్రస్తుతం అందరి కళ్లు సితారపైనే ఉన్నాయని అంటే అతిశయోక్తి కాదు.

ఘట్టమనేని వారసురాలిగా మహేష్ బాబు గారాల పట్టీగా ఇప్పటికే సోషల్ మీడియాలో సితార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సితారను హీరోయిన్ గా తీసుకొస్తారా.. లేక వేరే రంగంలోకి తీసుకెళ్తారా.. అనేది మహేష్ అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. సినిమాలోని పెన్నీ సాంగ్ లో సితార డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసింది. సితార గురించి మాట్లాడుతూ… మహేష్ ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్ లో సితార పర్ఫామెన్స్ గురించి అడగగా… అది థమన్ ఆలోచన. నాకు కూడా తెలియదు. ఇంటికి వెళ్లి నమర్కతకు చెప్పేలోపు అతనే నమ్రతను అడిగేశాడు. ఈ విషయంపై మహేష్ మాట్లాడుతూ… నేను క్లైమాక్స్ షూట్ లో బిజీగా ఉన్నానని… డైరెక్టర్ వెళ్లి నతమ్రతతో మాట్లాడి సితారతో డ్యాన్స్ ఓకే చేశారని వెల్లడించారు.