TS SSC Exams: చైనాలో పుట్టిన కరోనా గత రెండేళ్ల నుంచి ప్రజలను ఆగమాగం చేస్తోంది. పిల్లల చదువులు, వ్యాపారాలు చాలా వరకు అటకెక్కాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. గత రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే పిల్లలందర్నీ ప్రభుత్వం పాస్ చేస్తూ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా సిలబస్ పూర్తి చెప్పనందున సామాన్య శాస్త్రానికి సంబంధించి ఒకటే పేపర్ ను పదో తరగతి పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో పదో తరగతి సామాన్య శాస్త్రం మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
పదవ తరగతి సామాన్య శాస్త్రాన్ని భౌతిక రసాయన శాస్త్రం, జీవ శాస్త్రంగా విభజించి ఇన్ని రోజులు పరీక్షలు నిర్వహించారు. భౌతిక రసాయన శాస్త్రానికి మార్కులు ఉండేవి. జీవ శాస్త్రం పేపర్ కి మార్కులు. అయితే ఈ ఏడాది ఈ పద్ధతిని మార్చారు. అయితే ఈ సారి రెండు పేపర్లను కలిపే నిర్వహిస్తున్నారు. ఇందులో మూడు సెక్షన్లు పెట్టి ముందు సెక్షన్ లో మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తారు. ఇందులో నుండి ప్రశ్నలకు సమాధఆనాలు రాయాల్సి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు రెండు మార్కులు. సెక్షన్ టూలో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా.. రెండింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రశ్నకు ఎనిమిది మార్కుల చొప్పున ఉంటుంది. సెక్షన్ త్రీలో మొత్తం నాలుగు ప్రశ్నలు ఇవ్వగా అందులో నుంచి రెండు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు ఎనిమిది మార్కులు. పార్ట్ బి మొత్తం పది మార్కులు. ఇందులో పది ఐచ్ఛిక ప్రశ్నలు… ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం మార్కులు కేటాయించారు.