sruthi-haasan-opens-about-trollings-on-social-media
Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ నటవారసురాలిగా అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ” శృతి హాసన్ “. ఆ తరువాత చాలా కాలం ఈ బ్యూటీకి సరైన హిట్ దక్కలేదనే చెప్పాలి. ఇక ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ భామ. దీంతో శృతి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తక్కువ సమయం లోనే టాలీవుడ్ లో లక్కీ లేడీగా మారిపోయింది శృతి హాసన్. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమా చేసింది ఈ బ్యూటీ. అలాగే బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అయితే బాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది శృతి. ఆ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్న శృతి ఆ తర్వాత గత ఏడాది క్రాక్ సినిమాతో తిరిగి ట్రాక్ లోకి వచ్చింది. రవితేజ నటించిన క్రాక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య 107 సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఏ సినిమాకు తన పై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయని ప్రశ్నించగా శృతి స్పందిస్తూ… తెలుగులో నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాకు తన పై ఎక్కువ ట్రోల్స్ వచ్చాయని తెలిపింది.
ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలించిన ప్రేమమ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. మలయాళంలో సాయిపల్లవి నటించిన మలర్ పాత్రలో ఇక్కడ శృతి నటించింది. మలర్ పాత్రకోసం నన్ను సంప్రదించినప్పుడు ఆ పాత్ర బాగా నచ్చినా.. ఒక్క క్షణం మాత్రం చేయకూడదనుకున్నా.. కాస్త ఆలోచించి ఓకే చెప్పేశా” అయితే సాయిపల్లవిని మరిపించేలా నటించాలని అనుకోలేదు. అయినా కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారు అని చెప్పుకొచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం శృతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Read Also : Motorola Frontier: మోటరోలా నుంచి మరో కొత్త ఫోన్.. ఫ్రంటియర్ సూపర్ ఫ్లాగ్‌షిప్ మొబైల్…!
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.