Sri Reddy : సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరియర్ మొదట్లో న్యూస్ రిప్రజెంటేటర్ గా పనిచేశారు. అనంతరం హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె పలు సినిమాలలో నటిగా నటించారు. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని శ్రీ రెడ్డి సైతం క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా సంచలన తారగా మారిన శ్రీరెడ్డి అప్పటినుంచి సినిమాలకు దూరమైన ఏదో ఒక సంచలన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
ఇకపోతే ఈ మధ్యకాలంలో శ్రీరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలకు కాస్త దూరంగా ఉంటూనే సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్నో వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇప్పటికే ఎన్నో రకాల వంట వీడియోలను చేస్తూ అందరికీ తన చేతి వంట రుచి చూపించిన శ్రీరెడ్డి తాజాగా మరొక వీడియో ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు. అయితే ఈసారి ఏకంగా చికెన్ లాలీపాప్స్ అంటూ అందరికీ నోరూరించారు.
ఈ మధ్యకాలంలో చికెన్ లాలీపాప్స్ తినే వారి సంఖ్య అధికమైంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చికెన్ లాలీపాప్స్ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లోనే రుచికరమైన చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో శ్రీరెడ్డి ఈ వీడియో ద్వారా వెల్లడించారు. తన బావకు చికెన్ లాలీ పాప్స్ తినడం అంటే ఎంతో ఇష్టమని, అందుకే తన బావ కోసం ప్రత్యేకంగా చికెన్ లాలీ పాప్స్ తయారు చేస్తున్నానంటూ ఈమె ఓ రేంజ్ లో సిగ్గుపడుతూ ఈ వీడియోని చేశారు. ఈమె తయారు చేసిన చికెన్ లాలీపాప్స్ చూస్తే ఎవరికైనా తినాలనిపించేలా ఉన్నాయి.మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీ రెడ్డి స్టైల్ లో చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World