...

Sreeja Kalyan : ఆ హీరోయిన్‌తో చనువుగా ఉండటం వల్లే శ్రీజ కళ్యాణ్‌కు విడాకులు ఇవ్వనుందా?

Sreeja Kalyan : సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎన్నో జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జంట విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య ధనుష్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట గత కొద్ది రోజుల నుంచి విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి కళ్యాణ్ మెగా కుటుంబంలో జరిగే పండుగలకు వేడుకలకు దూరంగా ఉంటున్నారు.

sreeja-giving-divorce-to-the-kalyan-close-with-heroine
sreeja-giving-divorce-to-the-kalyan-close-with-heroine

అదే విధంగా కళ్యాణ్ దేవ్ నటించిన సినిమాలకు కూడా మెగా కుటుంబం మద్దతు లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అందుకే మెగా అల్లుడికి ఎలాంటి మద్దతు తెలుపలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇలా వీరి గురించి అనుమానాలు వస్తున్న నేపథ్యంలో శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలలో శ్రీజ కళ్యాణ్ అని ఉన్న పేరును కాస్త శ్రీజ కొణిదేలగా మార్చుకోవడంతో చాలామంది సమంత మాదిరిగానే శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇవ్వబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.

ఈ విధంగా వీరి విడాకులు గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయం పై మెగా కుటుంబం ఏమాత్రం స్పందించలేదు. మరోవైపు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా ఎన్నో పోస్ట్ లు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం ఎంతో సంతోషంలో ఉన్నాను, హ్యాపీగా ఉంది అంటూ కామెంట్ చేయడంతో మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే కళ్యాణ్ దేవ్ ను శ్రీజ ఈ విధంగా దూరం పెట్టడానికి గల కారణం ఆయన ఇండస్ట్రీకి చెందిన మరొక హీరోయిన్ తోఎంతో చనువుగా ఉన్నారని అందుకే శ్రీజ తనని దూరం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ వార్తలపై మెగా కుటుంబం స్పందించాల్సి ఉంది.

Read Also : MLA Roja : ఆ హీరో‌పై మనసు పడిన జబర్దస్త్ జడ్జి రోజా.. అవకాశం వస్తే నటిస్తానంటూ కామెంట్స్!