Sree reddy: శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనో రెబెల్ యాక్టర్. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మొదట లేవనెత్తింది తనే. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది ఈ భామ. తర్వాత తన బోల్డ్ మాటలతో ఎప్పుడూ వివాదస్పదం అవుతూనే వచ్చింది. తన మాటల్లాగే చేతలూ ఉంటాయి. అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గదు. శ్రీరెడ్డి తరచూ సినీ ఇండస్ట్రీ గురించి రాజకీయాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బాగా గుర్తింపు పొందింది.
అప్పట్లో పవన్ కల్యాణ్ పై ప్రతి ఒక్కరూ ఏవగించుకునే రీతిలో బూతులు తిట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చినా ఎక్కడా తన అందాల ఆరబోతను కానీ మాటల ప్రవాహాన్ని గానీ ఆపలేదు. ఇంకాస్త డోసు పెంచింది. తాజాగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పలు వీడియోలు చేస్తోంది. వంటలు వీడియోల్లోనూ తన అందాల ప్రదర్శనను ఏమాత్రం ఆపలేదు.
తాజాగా శ్రీరెడ్డి పెళ్లి కూతురు గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పెళ్లి కూతురు గెటప్ లో శ్రీరెడ్డి అచ్చంగా తెలుగింటి అందంగా కనిపించింది. ఈ వేసవి కాలంలో చాలా పెళ్లిళ్లు అవుతుంటాయని, అందుకే తాను కూడా పెళ్లి కూతురుగా తయారు కావాలని కోరుకుంటున్నానని తెలిపింది. తాను పెళ్లి ఎలాగూ చేసుకోను కనీసం పెళ్లి కూతురుగా అయినా తయారవుతానని చెప్పింది. తెలుగింటి అందంలా ముస్తాబైన శ్రీ రెడ్డిని చేసుకోబోయే వరుడు ఎవరు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.