...

Sravana somavaraa vratham: ఆషాఢ మాసంలో పరమ శివుడికి ఇలా పూజ చేస్తే.. అన్నీ శుభాలే!

Sravana somavaraa vratham: హిందూ సంప్రదాయాల ప్రకారం ఆషాఢ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే ఈ నెలలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది జూన్ 29 నుంచి జూలై 28 వరకు ఆషాఢ మాసం ఉండబోతోంది. ఆషాఢం కోసం శివ భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాసం అంటే ఈ పరమ శివుడికి చాలా ఇష్టం. ఈ మాసంలో శివుడిని పూజించాలంటే అభిషేకం చేస్తే.. విశేష పుణ్యం లభిస్తుంది. ఈ మాంలో శివలింగంపై బిల్వ పత్రాన్ని సమర్పించడం కూడా చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్న వారు ఈ మాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉండి శివ పూజ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కల్గుతాయయట.

ఆషాఢ మాసంలో సోమవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. శివలింగానికి పాలతో అభిషేకం చేసి.. ఉపవాస ప్రతిజ్ఞ తీస్కోండి. ఉదయం, సాయంత్ర శివుడిని ప్రార్థించండి. పూజ కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించి, శివునికి పువ్వులు సమర్పించండి. జపం చేసిన తర్వాత శివుడికి తమలపాకులు, పంచామృతం, కొబ్బరి కాయ, బిళ్వ పత్ర ఆకులను సమర్పించండి. ఉపవాస సమయంలో పంచాక్షరి జపించండి. కాబట్టి మీరు కూడా ఈ పూజ చేసి అనేక లాభాలను పొందండి.