...

Southwest Monsoon in India: ఈ ఏడాదంతా సాదారణ వర్షపాతమేనట..!

నైరుతి రుతు పవనాల కారణంగా దేశంలో ఈ ఏడాది సాధారణ వర్షపాతమే నమోదు కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీర్ఘ కాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించింది. ఉత్తర భారతం, మధ్య భారతం, హిమాలయాలు సహా ఈశాన్య భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం లేదా సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలు సహా వాయవ్య, దక్షిణ భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురుస్తుందని వెల్లడించింది.

గత మూడేళ్లలో కూడా భారత్‌లో నైరుతి రుతు పవనాల కారణంగా సాధారణ వర్షపాతమే నమోదు అయిందని స్పష్టం చేసింది. నైరుతి రుతు పవనాలకు సంబంధించి మే నెలాఖరులో వాతావరణ శాఖ మరింత స్పష్టత ఇస్తుంది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య గల కాలాన్ని నైరుతి రుతుపవనాల కాలంగా పరిగణిస్తారు. అయితే అలాగే పరిగణించి ఈ ఏడాది కురవబోయే వర్షం గురించి సూచనలు చేస్తున్నారు.