...

Karthika Deepam: నిరూపమ్ ఫోటో చూపించి తనే నా మొగుడు అంటున్న సౌర్య.. కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చిన హిమ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ సౌర్య కు నేనే హిమను అని చెప్పేస్తాను అని మనసులో అనుకుంటుంది. నువ్వు లేకుండా నేను పెళ్లి చేసుకోలేను సౌర్య అని అనుకుంటుంది. ఈ క్రమంలో హిమ సౌర్య లు ఒక రెస్టారెంట్లో ఉంటారు. ఇక ఇద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు.

ఆ తర్వాత సౌర్య మీద ఐస్ క్రీమ్ పడగా క్లీన్ చేసుకోవడానికి తను వాష్ రూమ్ కి వెళుతుంది. వచ్చేలోపు అక్కడ హిమ ఉండదు. మరోవైపు ప్రేమ్ ఫోటోగ్రఫీ కన్నా ఎక్కువ హిమనే ప్రేమించాను అని గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ క్రమంలో హిమ ఫోటోలు మొత్తం డిలీట్ చేస్తాడు.

ఇక నేను ఒంటరినే కదా.. అని ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు హిమ వాళ్ళ అమ్మ ని తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. ఈలోగా అక్కడకు సౌందర్య వచ్చి నీ ఫ్రెండ్ ని తెచ్చుకోలేకపోయవా.. నీకు తోడుగా ఉండేది అని అంటుంది. ఇక హిమ నా ఫ్రెండే నా అక్క నానమ్మ.. అని మనసులో అనుకుంటుంది.

ఇక తీసుకురావాలని ఉంది నానమ్మ.. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు అని చెబుతుంది. ఇక సౌందర్య ఇది కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే పెళ్లి మాత్రం సౌర్య దొరికిన తరువాతే చేస్తాను అని హిమ కు ప్రామిస్ చేస్తుంది. అంతేకాకుండా సౌర్య ను వెతికే బాధ్యత నాది అని చెబుతుంది.

ఈలోపు వాళ్ల దగ్గరికి చైత్ర వస్తుంది.. ఇక సౌందర్య ఆమెను హిమకు మెహందీ పెట్టమని చెబుతుంది. ఇక చైత్ర ను గుర్తుకు తెచ్చుకున్న హిమ వెంటనే సౌందర్య ను కౌగిలించుకుంటుంది. ఇక మనసులో నన్ను బావని కలపడానికి ఇంతలా పోరాడవ అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు సౌర్య సారీ చూసుకుంటూ ఈ సారీ నా కోసం డాక్టర్ సాబ్ పంపించారట. డాక్టర్ సాబ్ కి నేనంటే ఎంత ఇష్టమో అని మురిసిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ సాబ్ మీరు నాకు ఏమి ఇచ్చినా సరే చాలా అందంగా అపురూపంగా ఉంటుంది అని చెబుతుంది. ఆ తరువాత సౌర్య ఆటో ఒక ప్యాసింజర్ ఎక్కుతుంది.

ఆమె నీ కాబోయే మొగుడు కూడా ఆటో నడిపితే ఎంచక్కా ఆటో నడుపుకోవచ్చు అని సౌర్య తో అంటుంది. దాంతో సౌర్య నేను ఆటో డ్రైవర్ ని చేసుకోవాలా అని తన పై విరుచుకుపడుతుంది. అంతేకాకుండా నిరూపమ్ ఫోటో చూపించి నాకు కాబోయే మొగుడు డాక్టర్ అంటూ ప్రౌడ్ గా చెబుతుంది.

ఇక తరువాయి భాగం లో హిమ, నిరూపమ్ లకు గుడిలో నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. నిశ్చితార్థం మధ్యలోనే హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి మధ్యలోనె లేచి వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో అదే గుడికి సౌర్య కూడా వస్తుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.