Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతన్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో హైదరాబాద్ క్లబ్ అధికారులు జ్వాలకి సన్మానం చేస్తాము అవార్డు ఇస్తామని చెప్పి రమ్మని ఇన్వైట్ చేసి వెళ్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్,హిమ కొబ్బరి బొండం తాగుతూ ఉంటారు. అప్పుడు నిరుపమ్ ఎందుకో ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు హిమ అని అడగగా ఏమీ లేదు అని అంటుంది హిమ. ఆ తర్వాత కొబ్బరి బోండాలు అతనికి డబ్బులు ఇవ్వడానికి జ్వాల ఇచ్చిన నోటు ఇవ్వగా అతను తీసుకోకపోవడంతో అప్పుడు నిరుపమ్ ఆ నోటు వైపు చూస్తూ ఈ నోటుని ఎంత వదిలించుకుందాం అన్నా వదలడం లేదు అని అంటాడు.
మరొకవైపు శోభకు అప్పులు ఎక్కువ అవడంతో బ్యాంకు మేనేజర్లు ఫోన్ చేసి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. మీకు ఇచ్చిన గడువు ఇప్పటికే పూర్తి అయ్యింది ఇప్పటికైనా డబ్బులు కట్టకపోతే హాస్పటల్ చేస్తాము అనడంతో శోభ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య, ఆనందరావు, హిమ ముగ్గురు కలిసి క్లబ్ అవార్డు ఫంక్షన్ కి వెళ్తారు. అప్పుడు హిమ నన్ను ఎందుకు తీసుకొని వచ్చావు నానమ్మ అని అడగగా.. అప్పుడప్పుడు అలా నలుగురిలో తిరుగుతూ ఉండాలి లేదంటే నీలా తయారవుతారు అని అంటుంది సౌందర్య.
ఆ తర్వాత ఆనందరావు నవ్వుతూ నీకు అవార్డు వస్తుంది హిమ అని అనగా నాకు అవార్డు వద్దు తాతయ్య సౌర్య ఇంటికి రావడమే కావాలి అని అంటుంది హిమ. ఆ తర్వాత అవార్డుల ఫంక్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ముఖ్యఅతిథిగా విచ్చేసిన సౌందర్య ఆనంద్ రావులు వేదిక పైకి వెళ్తారు. అప్పుడు సౌందర్య మాట్లాడుతూ ఉండగా ఇంతలో జ్వాల ఎంట్రీ ఇవ్వడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది సౌందర్య.
ఆ తర్వాత ముందు కూర్చోవాలి అనుకుని వచ్చిన జ్వాలా హిమను చూసి వెనక్కి వెళ్ళిపోవాలి అని అనుకోని మళ్లీ వెళ్లి వెనుక సీట్లో కూర్చుంటుంది. ఆ తరువాత జ్వాలాని అవార్డుని తీసుకోవడానికి వేదిక పైకి పిలుస్తారు. అది చూసి హిమ ఆనంద పడుతూ ఉండగా జ్వాలా మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఆ తర్వాత సౌందర్య అవార్డు ఇవ్వబోతూ ఉండగా ఆ క్లబ్ నిర్వాహకులు కాస్త మార్పులు చేసి హిమతో అవార్డును ఇప్పించాలి అని అనుకుంటారు.
అప్పుడు హిమ జ్వాల ఏమన్నా అంటుందేమో అన్న భయంతో స్టేజి పైకి వస్తుంది. అప్పుడు యాంకర్ ఎవరో కాదు ఆనందరావు గారి సొంతం మనవరాలు అనడంతో జ్వాలా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు హిమ షాక్ లో ఉండగా జ్వాలా ఒక్కసారిగా హిమ చంప చెల్లుమనిపిస్తుంది.
ఇన్ని రోజులు నా చుట్టూ ఉంటూ నేను చెప్పే కథల వింటూనే నువ్వు నన్ను మోసం చేస్తూ వచ్చావు అని అంటుంది జ్వాల. అప్పుడు హిమ నచ్చదు చెప్పడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ జ్వాలా మాత్రం వినిపించుకోదు. నువ్వు నిజంగానే ఒక మోసగత్తేవే అంటూ హిమ పై ఒక రేంజ్ లో విడుచుకుపడుతుంది సౌర్య. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.