Karthika Deepam july 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య నా మనసు విరిగిపోయింది దూరంగా వెళ్ళిపోతాను అనడంతో సౌందర్య దంపతులు బాధపడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య,ఆనందరావు లు జ్వాలాని ఎక్కడికెళ్తావే అని ప్రశ్నిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇక వారి బాధని చూసి అనుమానంతో జ్వాలా మీరు ఎందుకు అంతలా బాధపడుతున్నారు. నా మీద ఎందుకు మీకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ అని అడగగా అప్పుడు సౌందర్య కాసేపు మౌనంగా ఉంది మనం ఎక్కడో కలిసాం.. అనుకోకుండా దగ్గర అయ్యాము కదా విడిపోతే ఎలా అని అంటుంది సౌందర్య.

Jwala receives a bravery award in todays karthika deepam serial episode
ఆ తర్వాత జ్వాల ఆటో నడుపుతూ వెళ్తూ ఉండగా ఇంతలో ఇద్దరు దొంగలు ఆటో ఎక్కిన తర్వాత వాళ్లు దొంగలు అని పసిగట్టిన జ్వాలా వాళ్లకు తెలియకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళుతుంది. అప్పుడు పోలీస్ జ్వాలాని పొగుడుతూ ఇవాళ అడ్రస్సు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళమని చెబుతారు. ఆ తరువాత చేంజ్ కోసం అని అనుకోకుండా నిరుపమ్ దగ్గరికి వెళ్లి చేంజ్ అడుగుతుంది.
అప్పుడు నిరుపమ్ ని చూడగానే జ్ఞాపకాలు అన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఆ తర్వాత చేంజ్ తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిరుపమ్ ఇచ్చిన డబ్బులు చూస్తూ ఇవి డాక్టర్ సాబ్ చేతి వేళ్ళు తాకిన డబ్బులు ఇవి నేను ఖర్చు చేయను అంటూ దేవుడి దగ్గర పెడుతుంది. ఆ తర్వాత నిరుపమ్ ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు హిమ, కార్తీక్ దీపల ఫోటోల ముందు నిల్చోని అమ్మ మీకు సౌర్యకి బావకి పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చాను కానీ నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి నిరుపమ్ వస్తాడు. మొన్న పెళ్లికి షాపింగ్ చేయాలి వెళ్దాం పద అని హిమ కు ఇష్టం లేకపోయినా పిలుచుకొని వెళ్తాడు.
మరొకవైపు జ్వాల ఇంటికి హైదరాబాద్ క్లబ్ నుంచి ఇద్దరు అధికారులు వస్తారు. మీరు దొంగలను పోలీస్ స్టేషన్లో అప్పగించారు అంట కదా మీరు చాలా గొప్ప అని చెబుతూ జ్వాలాని పొగుడుతారు. ఆ తర్వాత ఇలాంటి ధైర్యం చేసే మహిళలకు హైదరాబాద్ క్లబ్ తరఫున అది ఏడాది మహిళలకు అవార్డులు ఇస్తాము అనడంతో అయ్యో అవన్నీ ఎందుకు సార్ ఏదో నా కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూడలేక పోలీసులకు పట్టించాను అని చెబుతుంది. ఆ తర్వాత వాళ్లు జ్వాలాకి రమ్మని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్లిపోతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam july 2 Today Episode : శోభకు పెళ్లి చేస్తాను అన్న నిరుపమ్.. షాక్ లో స్వప్న..?