...

Burger order: తన తల్లి ఫోన్ తో ఈ రెండేళ్ళ బాలుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Burger order: సాధారణంగా చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని సందర్భాల్లో కోపం తెప్పించినా కూడా చాలా సరదాగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలు తెలియక చేసే పనుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రస్తుత కాలంలో పిల్లలు మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. తల్లితండ్రులు కూడా పిల్లలను సముదాయించటానికి వారికి ఫోన్ ఇవ్వటం అలవాటు చేస్తున్నారు. పిల్లలు ఫోన్ తో ఆడుకుంటూ కొన్ని సందర్భాలలో వారికి తెలియకుండానే ఇతరులకు కాల్ చేయటం, మెసేజ్ లు చేయటం, ఏదైనా ఇంపార్టెంట్ డేటా డిలీట్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు.

అయితే ఫోన్ విషయంలో ఈ రెండేళ్ళ వయసు గల బాలుడు చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు.యునైటెడ్ స్టేట్స్ టెక్సాస్ కు చెందిన కెల్సే బుర్కల్టర్ గోల్డెన్ ఎందెళ్ళ కుమారుడు బారెట్ తన తల్లి ఫోన్ తో ఆడుకుంటూ తనకు తెలియకుండా తన తల్లి ఫోన్ నుండి డోర్‌డాష్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మెక్‌డొనాల్డ్స్ నుండి 31చీజ్ బర్గర్‌లను ఆర్డర్ చేశాడు. కొద్దిసేపటి తరువాత ఫుడ్ డెలివరీ బాయ్ నుండి మెస్సేజ్ రావడంతో ఫోన్ తీసుకొని చూడగా.. తన కుమారుడు ఫోన్ తో ఆడుతూ తనకి తెలియకుండానే బర్గర్ లు ఆర్డర్ చేసినట్టు గుర్తించింది.

ఆర్డర్ వచ్చిన తర్వత తన కుమారుడిని వాటి పక్కన కూర్చోబెట్టి ఫోటో తీసి దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ.. నా వద్ద 31 మెక్ డొనాల్డ్స్ చీజ్ బర్గర్ లు ఉన్నాయి. నా కుమారుడు తెలియకుండా వాటిని ఆర్డర్ చేశాడు అంటూ రాసుకోచ్చింది. అయితే వాటిని ఏం చేయాలో తెలీక కెల్సే బుర్కల్టర్ గోల్డెన్ కొందరికి డొనేట్ చేసింది. ఇక నుండి ఎలాంటి పొరపాటు జరగకుండా వుండేందుకు నా మొబైల్ ఫోన్ దాచిపెడతాను.. లేదంటే ఫుడ్ డెలివరీ యాప్ హైడ్ చేస్తాను అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.