Sarkaru vari pata: ఎంతగానో ఎదురుచూసిన మహేశ్ బాబు చిత్రం సర్కారు వారి పాట ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్ తెరకెక్కించడంతో ఈ చిత్రం ఎలా ఉంటుందున్న ఆసక్తిలో చాలా మందిలో నెలకొంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిత్ర టీజర్, ట్రైలర్లు మూవీపై ఎక్కడలేని బజ్ ను క్రియేట్ చేయగా… ప్రమోషన్స్ తో ఈ బజ్ ను రెట్టింపు చేసింది.
ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట మంచి టాక్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పక్కాగా హిట్ అందుకుంటుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అంతేగాక ఈ సినిమా రిజల్ట్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతుందని వారు చిత్ర యూనిట్ తో ఒప్పందం చేసుకున్నారుట. అంటే సర్కారు వారి పాట మంచి విజయం అందుకుంటే ఓటీటీ కి రావడం లేట్ అవుతుంది. లేదంటే మాత్రం చాలా త్వరగానే ఓటీటీలో సర్కారు వారి పాట చిత్రాన్ని మనం చూడవచ్చు. ఇక సినిమా ఎలా నడుస్తుందో చూడాల్సి ఉంది. హిట్ అందుకుంటుందని మహేశ్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.